బ్యాంకుల్లో మహిళ సమ్మాన్ పథకం
గ్రామీణ మహిళల్లో ఆనందోత్సహం
ప్రజా దీవెన/ హైదారాబాద్ : పొదుపు అంటేనే మహిళ, మహిళ అంటేనే పొదుపు. మహిళల ఓట్ బ్యాంకు టార్గెట్ చేయడానికి మన ప్రభుత్వాలు వారికి అనేక ప్రయోజనకర పథకాలు ప్రవేశపెడుతున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే వారిని మరింత చైతన్య పరచడానికి కేంద్ర ప్రభుత్వం ” మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ను ఒకదానిని తీసుకు వచ్చింది.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు మేలు చేకూర్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద మహిళలు రూ.2 లక్షల వరకూ సొమ్మును రెండేళ్ల పాటు డిపాజిట్ చేస్తే అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పథకం మధ్యతరగతి మహిళలు బ్యాంకుల ద్వారా పొదుపు చేసుకునే అవకాశాన్ని పెంపొందిస్తుంది.
ఇక బ్యాంకుల ద్వారా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దాంతో ప్రభుత్వం బ్యాంకులకు తాజాగా ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్-2023 కోసం యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్( Axis Bank ), ఐడిబిఐ బ్యాంక్‌లతో సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంక్( Private Banks )లు రెండూ సులభతరం చేయడానికి ఖాతాలను తెరిచే అధికారం కలిగి ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఒకటి జారీ చేసింది. జూన్ 27, 2023 విడుదలైన అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, ఆయా బ్యాంకులు సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్‌ని ఆపరేట్ చేయడానికి అధికారం ఉందని పేర్కొంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది 2023 బడ్జెట్లో మహిళలను పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రత్యేక పొదుపు పథకం అని తెలుసుకోవాలి. వడ్డీ రేటు విషయానికొస్తే, ఈ పథకం మహిళలకు 7.5 శాతం స్థిర వడ్డీ రేటును అందిస్తుంది. వడ్డీని త్రైమాసికానికి కలిపి ఖాతాలో జమ చేస్తారు. ఖాతా మూసివేత సమయంలో ఇది సదరు మహిళలకు పూర్తిగా చెల్లించబడుతుంది.పదవీకాలం విషయానికొస్తే ఈ పథకం 2 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో వుంది. ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2025 వరకు అందుబాటులో ఉంటుంది.
ఈ కాలపరిమితి తర్వాత ఈ పథకంలో పెట్టుబడులు ఆమోదించరు. ఈ స్కీమ్‌కు అవసరమైన కనీస డిపాజిట్ రూ. 1000, గరిష్ట పరిమితి ఒక్కో ఖాతాకు రూ. 2 లక్షలు. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక సంవత్సరం తర్వాత, అర్హత ఉన్న బ్యాలెన్స్‌లో 40 శాతం విత్‌డ్రా చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది.