కొనుగోళ్లు మరింత వేగవంతం
అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహ కులను ఆదేశించారు.
నల్లగొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా ధాన్యం కొనుగోలను వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహ కులను ఆదేశించారు.గత రాత్రి కురిసిన అకాల వర్షం దృష్ట్యా శనివారం ఆయన ఆర్జల బాబి, ఎస్ఎల్బీసీ, కొత్తపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలిం చారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని,ధాన్యం కొనుగోలు కేంద్రా లలో రైతులకు అవసరమైన మా లిక సదుపాయాలు కల్పించాలని , వర్షానికి ధాన్యం తడవకుం డా తగు చర్యలు తీసు కోవాలని ఆయన ఆదేశించారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, సారసర ఫరాల జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.