Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

YS Sharmila: మేనత్త వైఎస్ విమలారెడ్డి పై షర్మిళ సంచలన వ్యాఖ్యలు

తన మేనత్త వైఎస్ విమలారెడ్డి పై ఏపీ సి సి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విమలమ్మ మాకు మేనత్త అని, మేము ఆధారా లు లేకుండా మాట్లాడటం లేదని, వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని

ప్రజా దీవెన, కడప: తన మేనత్త వైఎస్ విమలారెడ్డి పై ఏపీ సి సి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విమలమ్మ మాకు మేనత్త అని, మేము ఆధారా లు లేకుండా మాట్లాడటం లేదని, వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదని, సి.బి.ఐ చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసినందున, అందుకే మేము మాట్లాడుతున్నామని చెప్పారు. ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నామని, హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారని, ఆర్థికంగా బల పడ్డారు కాబట్టే జగన్ వైపు మాట్లాడుతు న్నారని, ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలు సుకోవాలని హితవు పలికారు. వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయిందని, విమలమ్మ కి వయసు మీద పడిందని, అందులో ఎండా కాలనైనందున ఇలాంటి మాటలు మాట్లాడుతుదని ఎద్దేవా చేశారు.