Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ఉల్లాసంగా.. ఉత్సాహంగా జగదీషన్న క్రీడా పోటీలు

క్రీడలను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి తనయుడు గుంటకండ్ల వేమన్ రెడ్డి

ఉల్లాసంగా.. ఉత్సాహంగా జగదీషన్న క్రీడా పోటీలు

చివ్వెంల మండలం లో క్రీడలను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి తనయుడు గుంటకండ్ల వేమన్ రెడ్డి

ఊరు.. ఊరు తిరుగుతూ క్రీడాకారులను ఉత్సాహపరిచిన వేమన్

ప్రజా దీవెన /సూర్యాపేట  : ర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా యువత లో క్రీడా స్పూర్తి ని నింపేందుకు సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సొంత నిధులను నిర్వహిస్తున్న క్రీడా పోటీలు చివ్వెంల మండల వ్యాప్తంగా ఉత్కంఠతభరితంగా సాగుతున్నాయి. చివ్వెంల మండల కేంద్రం లో క్రీడా పోటీలను మంత్రి జగదీష్ రెడ్డి తనయుడు గుంటకండ్ల వేమన్ రెడ్డి ప్రారంభించారు. క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, బాడ్మింటిన్‌, టెన్నికాయిడ్‌, రన్నింగ్‌, హైజంప్‌, లాంగ్‌జంప్‌, షార్ట్‌ఫుట్‌, పోటీలు హోరాహోరీగా సాగాయి. చివ్వెంల మండల కేంద్రం తో పాటు పోటీలు జరుగుతున్న చందుపట్ల, గుంపుల , గాయం వారి గూడెం, తిమ్మాపురం, మోదినిపురం, తో పాటు పలు గ్రామాలలో మంత్రి తనయుడు వేమన్ రెడ్డి పర్యటించి, క్రీడాకారులను ఉత్సహపరిచారు.. ఈ సందర్బంగా వేమన్ మాట్లాడుతూ తన లాంటి యువత జీవితం లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే క్రీడా స్ఫూర్తి అవసరమని , ఈరోజు పూర్తి ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను ఎదుర్కోవడానికి కావలసిన శక్తి సామర్థ్యాలను లభిస్తాయని నమ్మే నాన్నగారు యువతలో గెలాస్పూర్తి నింపేందుకు క్రీడల నిర్వహణకు శ్రీకారం చుట్టారన్నారు.

గత వారం రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న క్రీడా పోటీలకు యువతి యువకుల నుండి వస్తున్న స్పందన అపూర్వమన్నారు. క్రీడలు అంటే నాకు అమితమైన ఇష్టం అన్న వేమన్, తాను కూడా యువతీ యువకులతో కలిసి క్రీడలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యువతీ యువకులతో పోటీగా ఆడపడుచులు కూడా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం అన్నారు.

వేమన్ రెడ్డి వెంట చివ్వెంల ఎంపిపి కుమారి బాబు నాయక్, జడ్పిటిసి సంజీవ్ నాయక్, వైసీపీ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు జీవన్ రెడ్డి, చివ్వెంల సర్పంచ్ సుధాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుధీర్ రావు,, పచ్చిపాల అనిల్ యాదవ్, ఎలకా హరీష్ రెడ్డి, సునీల్ నాయక్, బాలాజీ అనిల్ తదితరులు ఉన్నారు .