BJP Manifesto: బిజెపి పేదల పెన్నిధి
దేశ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్‌ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేర్చడంతో పాటు రూ. ఐదు లక్షల రకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.
ప్రజలందరికీ ఐదేళ్లు ఉచిత రేషన్ అందిస్తాం
ఆయుష్మాన్ భారత్‌లో రూ. ఐదు లక్షల ఉచిత వైద్యం
బిజెపి సార్వత్రిక ఎన్నికల మేనిఫె స్టో విడదల సందర్భంగా ప్రధాని మోదీ
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్లు కూడా ఉచిత రేషన్‌ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.(Free ration will be provided to all people for five years) 70 ఏళ్లు పైబడిన వృద్ధులనూ ఆయుష్మాన్ భారత్‌లో చేర్చడంతో పాటు రూ. ఐదు లక్షల రకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. బిజెపి సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల సంద ర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించా రు. ఇప్పటివరకు పేదలకు నాలుగు కోట్లు ఇళ్లు కట్టించి ఇచ్చామని, మరో మూడు కోట్లు ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. భవిష్యత్తులో పైపు లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ అంది స్తామని హామీ ఇచ్చారు. పిఎం సూ ర్య ఘర్ పథకానికి కోటి మంది రిజి స్టర్ చేసుకున్నారని, ఇంట్లో తయా రైన కరెంట్‌ను మీరు అమ్ముకోవ చ్చని పేర్కొన్నారు.
ముద్ర పథకం కింద కోట్ల మందికి స్వయం ఉపాధి లభించిందని, ముద్ర పథకం కింద ఇచ్చే రుణాన్ని రూ.20 లక్షలకు పెంచుతామని, చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామని, దివ్యాం గుల కోసం అనేక కార్యక్రమాలు చేప ట్టామని తెలియజేశారు. పదేళ్లలో పది కోట్ల మంది మహి ళలు స్వయం సహాయ సంఘాల్లో చేరారని, మహిళలు ప్రారిశ్రామికవే త్తలు కావాలని ప్రోత్సహిస్తున్నా మని, వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారు లను చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల విని యోగం పెంచుతామని, భారత్‌ను గ్లోబల్ న్యూట్రిషన్ హబ్‌గా మారు స్తామని, శ్రీ అన్న్ రకం పండించడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, సముద్ర నాచు, ముత్యాల సాగు దిశగా మత్య్సకారులను ప్రోత్సహిస్తామని మోడీ తెలిపారు.
అంతకు ముందు మాట్లాడిన బిజెపి జాతీయ అధ్యక్షు డు జెపి నడ్డా మట్లాడుతూ బిఆర్ అంబేడ్కర్ జయంతి రోజు సంకల్ప్ పత్రం విడదల చేయడం సంతోష కరమైన విషయమని తెలిపారు. సామాజిక న్యాయంక కోసం అంబేడ్కర్ జీవితాంతం పోరాటం చేశారని, అంబేడ్కర్ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామని, అంబేడ్కర్ ఆకాంక్షలను అమలు చేస్తున్నామని వివరించారు. బిజెపి సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడదల చేసిన సందర్భంగా నడ్డా ప్రసంగించారు. సంకల్ప్ పత్ర పేరుతో బిజెపి మేనిఫెస్టో విడుదల చేసిందని,(BJP Manifesto released in delhi) మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టో విడుదల చేశామన్నారు. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్ పత్ ఉంటుందని వివరించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టో రూపొందించిం దని వివరించారు.
మేనిఫెస్టో కోసం 15 లక్షల సలహాలు, సూచనలను కమిటీ పరిశీలించిందన్నారు.వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో అనేది తమ మేనిఫెస్టో చెబుతుంద ని అందరినీ కలుపుకుని ముందు కెళ్తేనే దేశ ప్రగతి (Country progress) సాధ్యమని బిజెపి విశ్వాసమని, మోడీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరు గులు తీస్తోందన్నారు. దేశ ప్రజలు తమకు రెండు సార్లు స్పష్టమైన మె జార్టీ ఇచ్చినందకు కృతజ్ఞతలు తెలి పారు. బిజెపి వచ్చాక మారు ముల గ్రామాలకు సైతం పక్కా రోడ్లు వేశా మని, ఇవాళ రోడ్డు లేని గ్రామం లేదని చెప్పవచ్చని, గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని, 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నామని, పేదలకు బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తు న్నామని చెప్పారు. పేదల జీవితాల్లో మార్పు రావాలనేదే తమ లక్షమని స్పష్టం చేశారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల నేదే తమ నినాదమని పిలుపు నిచ్చారు. సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
బిజెపి మేనిఫెస్టో విడుదల చేసింది. 14 అంశాలతో బిజెపి మేనిఫెస్టో విడదల చేసింది.
1. విశ్వ బంధు
2. సురక్షిత భారత్
3. సమృద్ధ భారత్
4. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
5. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు
6. జీవన సౌలభ్యం
7. సాంస్కృతిక వికాసం
8. గుడ్ గవర్నెన్స్
9. స్వస్థ భారత్
10.అత్యుత్తమ శిక్షణ
11.క్రీడావికాసం
12.సంతులిత అభివృద్ధి
13.సాంకేతిక వికాసం
14.సుస్థిర భారత్
వచ్చే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్