Grain purchase : ధాన్యం సేకరణ వేగవంతం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా యాసం గి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు.
5 లక్షల ధాన్యం కొనుగోలు లక్ష్యంలో ఇప్పటికే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
సుమారు రూ. 13 కోట్ల రూపాయ లు రైతుల ఖాతాలలో జమ
కొనుగోలు కేంద్రాల సక్రమ నిర్వ హణకు జిల్లా కలెక్టర్ చొరవ
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం నెరవేరేలా యాసం గి ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో దాన్యం సేకరణ వేగవం తంగా జరుగుతున్నది. రైతులు పండించిన దాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను ఈ యాసంగిలో జిల్లాలో 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, 370 కి 370 కేంద్రాలను ప్రారంభించడం జరిగింది .
ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 171 కోట్ల రూపాయల విలువ చేసే 77,783 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.శనివారం నాటికి 12 కోట్ల 66 లక్షల రూపా యలు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారులతో పాటు, మార్కెటింగ్, సహకార, డిఆర్డిఏ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేయడంతో పాటు, రెవెన్యూ అదనపు కలెక్టర్, తహసిల్దారులు సైతం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించేలా చర్యలు తీసు కోవడం జరుగుతున్నది.
అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన టార్పాలిన్లు, తూకం, తేమ కొలిచే యంత్రాలు, ధాన్యాన్ని తూర్పారబట్టేయంత్రాలు, నీడ తాగునీరు వంటి సౌకర్యాలను కల్పించింది . గన్ని బ్యాగులకు ఎలాంటి కొరత లేకుండా జిల్లా వ్యాప్తంగా కోటి రెండు లక్షల గన్ని బ్యాగులను సిద్ధం చేసింది. ఇందు లో 34 లక్షల గన్ని బ్యాగు లను కొనుగోలు కేంద్రాలకు పంపిం చడం జరిగింది. తహసిల్దా రులు, డిప్యూటీ తాసిల్దారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడమే కాకుండా వారి పరిధిలో ఉన్న రైస్ మిల్లులను సైతం సందర్శించి అక్కడ ధాన్యం దించుకునేందుకు సరైన సదుపాయాలు ఉన్నది లేనిది పరిశీలించే విధంగా హమాలీలు, వాహనాలు అన్నిటిని ఎప్పటికప్పు డు సమీక్షించి తనకు నివేదికలు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జరిచేయడం జరిగింది.
ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుం డా మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దించుకోవడం తోపాటు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సీఎం ఆర్ ను సైతం సకాలంలో చెల్లించా లని మిల్లర్లతో సమీక్షించడం జరి గింది. దీంతోపాటు, ధాన్యం కొను గోలులో సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించేందుకు ప్రత్యేకించి జిల్లా స్థాయిలో 24 గంటలు పని చేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో 9963407064 నంబర్ ను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను చేపట్టడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి ప్రకటించిన కనీస మద్దతు ధర 2203/- రూపాయలు ,అదేవిధంగా సాధారణ రకానికి 2183/- రూపాయలు పొందేలా అవగాహన కల్పించి ధాన్యాన్ని శుభ్రపరిచి కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కొనుగోలు కేంద్రాలలో సీరియల్ ఆర్డర్లో ధా న్యాన్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఏ -2 రిజిస్టర్ను ,ఇతర రిజి స్టర్ల నిర్వహణను పౌరసర ఫరాల అధికారులు ఎప్పటి కప్పుడు తని ఖీ చేస్తున్నారు. ఆర్డీవోలను సైతం వారి పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి ధాన్యం సేకరణ సక్రమంగా జరిగే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది .జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల వల్ల నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ఏలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్న ది.