Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gulf workers: గల్ఫ్ కార్మికులకు బీమా

తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని, ఏజెంట్ల బారిన పడి కొందరు,యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు

ప్రత్యేక బోర్డు, టోల్ ఫ్రీ నెంబర్
సెప్టెంబర్ 17 లోగా సమస్యల పరిష్కారం
గల్ఫ్ కార్మిక సంఘాల నాయకుల తో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ నుంచి ఎక్కువమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారని, ఏజెంట్ల బారిన పడి కొందరు,యాజమాన్యం చేతిలో మరికొందరు కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.గల్ఫ్, ఇతర దేశాలకు వెళ్లే కార్మికుల కోసం ప్రత్యేక బోర్డ్ ఏర్పాటుకు అధ్యయ నం చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజా భవన్ లో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని, ఒక టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17 లోగా మీ సమస్యల పరిష్కారానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత మాది అని ఉద్ఘాటించారు.గల్ఫ్ కార్మిక సంఘాల నాయకుల తో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఫిలిప్పీన్ విధానాలను మేం స్పష్టంగా అధ్య యనం చేసామని, కార్మికుల హక్కు లు కాపాడేందుకు ఆ దేశమే ఇతర దేశాల వ్యవస్థలతో మాట్లాడుతుం దన్నారు. కేరళ ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలను కూడా అధ్యయ నం చేసామని, ఇప్పటికే గల్ఫ్ కార్మి కుల కోసం ఒక పాలసీ డాక్యుమెం ట్ (Policy document) తయారు చేసామని వివరిం చారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిశాక ప్రభుత్వం తరపున మిమ్మల్ని ఆహ్వానిస్తామని, పాలసీ డాక్యుమెంట్ పై మీ అభిప్రాయా లను, సూచనలను తీసుకుని ముందుకెళతామని స్పష్టం చేశారు.

గల్ఫ్ కార్మికులకు న్యాయపరమైన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా చర్యలు తీసుకో బోతున్నామని, ఏజెంట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నమోదు చేసుకునే లా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గల్ఫ్ వెళ్లే (Gulf worker)వారికి ఒక వారం రోజులు శిక్షణ అందించేం దుకు చర్యలు చేపట్టాలని భావిస్తున్నామని, రైతు బీమాలాగే గల్ఫ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుం టున్నామని చెప్పారు. మీ తరపున ప్రాతినిధ్యం వహించేందుకు జీవన్ రెడ్డి అన్నకు అవకాశం ఇవ్వాలని, పార్లమెంట్ లో మీ గొంతు వినిపిం చేందుకు నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.

Insurance for Gulf workers by revanth reddy