Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

మందేసి ఆరు ప్రమాదాలు చేశాడు

ఓ యువకుడు మద్యం తాగి అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్​లోని ఐకియా నుంచి ప్రారంభించి వరుసగా రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కామినేని ఆసుపత్రి వరకు ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.

హైదరాబాద్ లో కారు బీభత్సం
గంటవ్యవధిలో అర్థరాత్రి హల్ చల్
ఒకరు మృతి, 11మందికి గాయాలు

ప్రజాదీవెన, హైదరాబాద్: ఓ యువకుడు మద్యం తాగి అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్​లోని ఐకియా (IKEA) నుంచి ప్రారంభించి వరుసగా (Rayadurgam Police Station) రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కామినేని ఆసుపత్రి వరకు ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి.

రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఈ వరుస ప్రమాదాలు చేశాడు. రాయదుర్గం ఠాణా పరిధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని నిజాంపేట ప్రగతినగర్​కు చెందిన పాతర్ల క్రాంతికుమార్​ యాదవ్​ ఆదివారం రాత్రి ఫుల్​గా మద్యం తాగాడు. ఆ మత్తులో కారులో బయలుదేరి ఐకియా రోటరీ వద్దకు చేరుకున్నాడు. తాగిన మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా ఆ కారు ధ్వంసమైంది. అందులోని ఒక మహిళకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఆ కారును ఢీకొట్టి అనంతరం అక్కడి నుంచి పారిపోతూ ఉండగా గచ్చిబౌలి బాబూఖాన్​ లేన్​ దగ్గర ఒక బైక్​ను ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో ఒకరికి కాలు విరిగిపోగా, ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.

పూటుగా మద్యం తాగి

నిందితుడు మరింత వేగంగా కారును నడుపుతూ పిస్తా హౌజ్​ ఎదురుగా వెళ్తూ 20-25 ఏళ్ల యువకుడిని ఢీకొట్టాడు. అక్కడి నుంచి పరారీ అయ్యాడు. వెంటనే ఆ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కానీ అతని వివరాలు ఏవీ బయటకు రాలేదు. మత్తులోనే మరో మూడు ప్రమాదాలు : ఓ వ్యక్తి మరణించిన క్రాంతి తన వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఆ పారిపోతూ రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ సమీపంలోని కిమ్స్​ ఆసుపత్రి దగ్గర మరో బైక్​ను ఢీకొట్టి వెళ్లిపోయాడు.

ఈ ఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా కారు ఆపకుండా అక్కడి నుంచి ఉడాయించాడు. ఇలా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ కిమ్స్​ ఆసుపత్రి సమీపంలోని ఆటోను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఇలా గుద్దుకుంటూ పోతూ వరుస ప్రమాదాలు చేస్తున్న క్రాంతిని కొందరు గమనించి వెంటాడి మల్కం చెరువు దగ్గర వాహనాన్ని అడ్డుకున్నారు.

ఆ యువకుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్రాంతి పోలీసులు రాయదుర్గం పోలీస్​ స్టేషన్​కు తరలించి మద్యం పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షలో పోలీసులు అవాక్కు అయిపోయారు. ఏకంగా మీటరు రీడింగ్​ 550 వచ్చి ఆశ్చర్య పోయారు. నిందితుడి పూర్తి వివరాలను సేకరించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించారు.

Rayadurgam Police Station starting from Ikea