Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

రోడ్డు ప్రమాదంలో బిఆర్ యస్ నేత దుర్మరణం

నల్లగొండ పట్టణం పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీకి చెందిన బి ఆర్ యస్ నేత జనార్దన్ రావు బుధవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: నల్లగొండ పట్టణం పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీకి చెందిన బి ఆర్ యస్ నేత జనార్దన్ రావు బుధవా రం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పానగల్ బై పాస్ నుండి దుప్పలపల్లి వెళ్లే మార్గ మద్యం లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మృతుడు జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అందులో చురుకైన నేతగా ఎదిగారు. కాలక్రమంలో బి ఆర్ యస్ లో చేరిన జనార్దన్ రావు గత మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు.

కంచర్ల బ్రదర్స్ దిగ్భ్రాంతి….

ఇదిలా ఉండగా రోడ్డు ప్రమాదంలో అనుంగ అనుచరుడు బి ఆర్ యస్ నేత జనార్డన్ రావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారన్న సమాచారం తెలిసిన కంచర్ల బ్రదర్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి,నల్లగొండ లోకసభ బి ఆర్ యస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి లతో పాటు సీనియర్ బి ఆర్ యస్ నేతలు కాంచనపల్లి రవీందర్ రావు,పట్టణ బి ఆర్ యస్ పార్టీ ఉపాధ్యక్షురాలు యాటా జయప్రద రెడ్డి లు సంతాపం ప్రకటించారు.

Nalgonda Panagal Road Srinagar Colony