Jail: నిందితుడికి 20 సంవత్సరాల సాధారణ జైలు
క్రైమమైనర్ బాలికపై హత్యాచార కేసులో నిందితుడికి 1వ అడిషనల్ జడ్జి బి.తిరుపతి సెక్షన్ 363, 342, 506, 376(2)(n)(f)(i)(3) ఐపిసి, సెక్షన్ 5(1)R/w 6 Of Protection of Children from Sexual offences Act-2012 of PS Dindi, ప్రకారం 20 సంవత్సరాల సాధారణ జైలు, బాధితురాలికి 10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ చందనా దీప్తి
ప్రజా దీవెన నల్గొండ: క్రైమమైనర్ బాలికపై హత్యాచార కేసులో నిందితుడికి 1వ అడిషనల్ జడ్జి బి.తిరుపతి సెక్షన్ 363, 342, 506, 376(2)(n)(f)(i)(3) ఐపిసి, సెక్షన్ 5(1)R/w 6 Of Protection of Children from Sexual offences Act-2012 of PS Dindi, ప్రకారం 20 సంవత్సరాల సాధారణ జైలు, బాధితురాలికి 10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
వివరాలలోకి వెళితే అంగోతు వినోద్ తండ్రి దస్రు, వయస్సు 27 సంవత్సరాలు, కులం (ఎస్టి) లంబాడా, ఓసీ ఆయుర్వేద మందుల అమ్మకందారుడు,R/o మర్రిపల్లి తాండ, చారకొండ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా చెందిన అతను డిండి మండలానికి చెందిన 9 వ తరగతి చదువుతున్న మైనర్ బాలికకు(Minor girl) మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో హత్యాచారం చేయగా బాధిత బాలిక తండ్రి పిర్యాదు మేరకు నిందితుని పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం సరిఅయిన ఆధారాలు కోర్టుకి సమర్పించగా గురువారం విచారణ అనంతరం నిందితుడికి 20 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, బాధిత బాలికకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ కేసులో సరిఅయిన ఆధారాలు సేకరించి కోర్టుకి అందజేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన అప్పటి ఇన్వెస్టిగేషన్ అధికారులు పి.పరశరాములు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ప్రస్తుత ఎస్ హెచ్ ఓ రాజు, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పీపీలు వెంకట్ రెడ్డి, జైరామ్ నాయక్, సిడిఓ కృష్ణా, లైసెనింగ్ ఆఫీసర్స్ పి.నరేందర్, ఎన్.మల్లికార్జున్ ను జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా అబినందిచినారు.
Accused imprisonment to 20 years