Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Interstate criminal: అంతర్రాష్ట్ర నేరస్తుడిని అరెస్ట్

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరస్థుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 16 లక్షల 24 వేల రూపాయల నగదుతో పాటు 20 తులాల 3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

16.24 లక్షలు విలువ గల 20. 3 తులాల బంగారు స్వాధీనం

ప్రజా దీవెన నల్గొండ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర (Interstate criminal) నేరస్థుడిని నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 16 లక్షల 24 వేల రూపాయల నగదుతో పాటు 20 తులాల 3 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరస్థుడికి సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం మీడియా ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించారు.ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన దేవరకొండ రాంబాబు తండ్రి రామదాసు పూల వ్యాపారం చేసేవాడు.

ఈనెల 10వ తేదీన మిర్యాలగూడ-1 టౌన్ పరిదిలో గల మౌర చంద్ర శేఖర్, తండ్రి అయోధ్యా తాము ఊరికి వెళ్లిన సమయంలో చోడికి పాల్పడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో 50 వేల రూపాయలు దొంగలించారని వారు ఇచ్చిన పిర్యాదుకు మేరకు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టిన ఎస్సై రవి శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈదుల గూడా చౌరస్తా వద్ద వాహనాల తనకి చేస్తుండగా నేరస్తుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతనిని పిలిచి విచారించగా, అతను మౌర చంద్ర శేఖర్ ఇంట్లో తాను చేసిన దొంగతనముతో పాటు మరిన్ని నేరాలను ఒప్పుకున్నట్లు వెల్లడించారు.

నేరస్తుడు గతములో రెండు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో దొంగతనము చేసి, జైలు జీవతము గడిపి వున్నాడని, చివరగా గుంటూరు సిసిఎస్ వారు అతను చేసిన దొంగతనాలకు గాను జైలుకు పంపగా, ఒక సంవత్సరము పాటు గుంటూరు జైలు లో గడిపి గత జనవరి 2024 చివరి వారములో బయటకు వచ్చినాడు. మరలా తన అవసరాల నిమిత్తం దొంగతనాలు మొదలు పెట్టాడు అని అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు, ఇన్స్ పెక్టర్ జి. సుధాకర్, యస్ఐ ఎం. రవి కుమార్, ఫింగర్ ప్రింట్స్ ఏ ఎస్సై శివ, కానిస్టేబుళ్లు ఎస్. వెంకటేశ్వర్లు, ఎన్. శ్రీను, పి. నాగరాజు, ఐటీ కోర్ మధు, ను జిల్లా ఎస్పి ఈ సందర్భంగా అభినందించినారు.

 

దొంగతనాల నియంత్రణ పై ప్రత్యేక బృందాలు

జిల్లా ఎస్పి అపూర్వ రావ్

జిల్లాలో దొంగలను పట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక బృందాలను ఏర్పటు చేసాం. అన్ని ప్రాంతాలలో నిఘా పెట్టి నియంత్రణ చర్యలు చేపట్టాం. జిల్లా ప్రజలు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రజలు వారి ఇంటి పరిసరాల్లో, కాలనీల్లో, షాపులలో సిసిటివి కెమెరాలు అమర్చుకావాలి. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే సంబంధిత వ్యక్తుల కదలిక పై తగు చర్యలు తీసుకోనుటకు వాటి ప్రాముఖ్యత చాలా అవసరం. ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాల్లో కాలనీల్లో,షాపులలో ముఖ్యమైన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సంబంధిత జైలు నుండి విడుదల అయిన నిందితుల పైన జె ఆర్ ఎం ఎస్ (జైల్ రీలిజింగ్ మానిటరీ సిస్టమ్) (Jail Releasing Monetary System)ద్వారా ప్రతీ నేరస్తుని కదలికల పై నిఘా ఏర్పాటు చేసాం.ఎవరైన అనుమానిత వ్యక్తులు తమ పరిసరాలలో కనిపిస్తే డయల్ 100 గానీ సంబంధిత పోలీసు స్టేషన్ పిర్యాదు చేయాలి.

Interstate criminal arrested in Nalgonda