Supreme verdict: 106 ఎకరాల భూమి అటవీ శాఖదే…. 39 ఏళ్ల కేసులో సుప్రీం తీర్పు
39 సంవత్సరాల తర్వాత భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ భూమికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీ శాఖదే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.
ప్రజాదీవెన, భూపాలపల్లి: 39 సంవత్సరాల తర్వాత భూపాలపల్లి జిల్లాలోని అటవీ శాఖ భూమికి సుప్రీం కోర్టులో (Supreme verdict ) ఊరట లభించింది. 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీ శాఖదే అని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. భూపాలపల్లి పట్టణంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వేనెంబర్ 171లో సర్వేలో ఉన్న 106.34 ఎకరాల అటవీ భూమి భూమిపై మహ్మద్ అబ్దుల్ ఖాసిం అనే వ్యక్తి హక్కును కోరుతూ 1985లో వరంగల్ జిల్లా కోర్టులో కేసు వేశారు. 1994లో అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు(Supreme verdict ) వెలువడగా, సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
2018లో హైకోర్టు అటవీశాఖకు(Forest) అనుకూలంగానే తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుపై మహ్మద్ అబ్దుల్ ఖాసిం రివ్యూ పిటిషన్ను హైకోర్ట్ లో దాఖలు చేయగా మార్చి 2021లో హైకోర్టు సదరు 106 ఎకరాల అటవీ భూమి మహ్మద్ అబ్దుల్ ఖాసింకు చెందుతుందని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పుపై అటవీశాఖ 2021 మే లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవు పిటిషన్ను దాఖలు చేసింది.
ఫిబ్రవరి 2024లో దీనిపై పై వాదనలు విన్న ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం106 ఎకరాల భూమి అటవీశాఖ దేనని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లను దాఖలు చేసిన అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకొనవలసిందిగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Supreme court verdict on land in a 39 year old case