Nomination: ఇలా నామినేషన్.. అలా కేసు… ట్విస్ట్ ఇచ్చిన ఏపీ అధికారులు
ఏపీలో ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో అభ్యర్థులు అందరూ నామినేషన్ దాఖలు చేసే పనిలో పడ్డారు.
ప్రజాదీవెన, పుట్టపర్తి: ఏపీలో ఎన్నికల(Assembly election) ప్రక్రియ వేగం పుంజుకుంది.(election notification)ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటంతో అభ్యర్థులు అందరూ నామినేషన్ దాఖలు చేసే పనిలో పడ్డారు. ఇన్నాళ్లూ టికెట్ కోసం తంటాలు పడిన అభ్యర్థులు.. ఇప్పుడు నామినేషన్ దాఖలు చేసి ఓటర్ల మనసు దోచుకునే పనిలో పడ్డారు. ఎలా ఓటర్లను ఆకర్షించాలి.. ఎలా ఓట్లు కొల్లగట్టాలనే పనిలో ఉన్నారు. ఇక ఈ ప్రక్రియలో ప్రత్యర్థి మీద విమర్శలు గుప్పించడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు షరా మామూలే. అలాగే మీడియాలోనూ కనిపిస్తుండాలని అభ్యర్థులు ఉబలాటపడుతుంటారు.
వీలైనంత మేరకు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ కనిపిస్తూ జనాల నోళ్లల్లో నానాలనేది వారి ఉబలాటం. అయితే ఈ ప్రయత్నమే ఓ టీడీపీ అభ్యర్థికి వింత అనుభవం ఎదురయ్యేలా చేసింది. అలా నామినేషన్(nomination) వేసి వస్తూనే.. కొద్ది సేపటికే కేసు నమోదయ్యేందుకు కారణమైంది. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో జరిగింది. పుట్టపర్తి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరుఫున పల్లె సింధూర రెడ్డి పోటీ చేస్తున్నారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలే పల్లె సింధూర రెడ్డి. అయితే పల్లె రఘునాథరెడ్డి మీద సర్వేల్లో కాస్త వ్యతిరేక ఫలితాలు రావటంతో.. ఈసారి ఆయన కోడలికి టీడీపీ అధిష్టానం ఛాన్స్ ఇచ్చిందనే వార్తలు ఉన్నాయి. ఏదైతేనేం పల్లె కుటుంబానికి టికెట్ దక్కిందనే సంతోషంలో రఘునాథరెడ్డి అనుచర గణం ఉంది.
Case registered on contest candidate