Politics: కొనసాగుతోన్న వలసలు
ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు గానే కాంగ్రెస్ లోకి వలసల వరద కొన సాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మె ల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరికొందరు క్యూ కడుతున్నారు.
కాంగ్రెస్ లోకి బిజెపి, బిఆర్ఎస్ నేతలు
సీఎం సమక్షంలో చేరిన బిజెపి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
సీఎం రేవంత్ ను కలిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు గానే కాంగ్రెస్ (congress)లోకి వలసల వరద కొన సాగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మె ల్యేలు కాంగ్రెస్ లో చేరగా తాజాగా మరికొందరు క్యూ కడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు బిజెపి,(BJP) బిఆర్ఎస్ నేతలు కలిశారు, కలుస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం బీజేపీ మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రవీంద్ర నాయక్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కండువా కప్పి రవీంద్ర నాయక్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఇదిలా ఉండగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ప్రకాష్ గౌడ్ తన ముఖ్య అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు.పార్లమెంట్ ఎన్ని కల వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి మరో బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ గౌడ్ రేపు తన ముఖ్య అనుచరులతో కలిసి పార్టీలో చేరతానని సీఎం రేవంత్ రెడ్డికి వెల్లడించారు.
అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా మాజీ సీఎం కేసీఆర్ తమ పార్టీతో 20 మంది ఎమ్మెల్యేలు (MLA)టచ్‌లో ఉన్నారని కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరనుండటం సం చలనంగా మారింది. మొత్తానికి లోక్ సభ ఎన్నికల్లో అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న తరుణంలో అందు కు సాక్షాత్కారంగా అధికార కాంగ్రెస్ పార్టీ లో కొందరు ముఖ్య నాయ కులు చేరుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
BRS leaders join congress and bjp