Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

మరో సంచలనానికి తెరలేపిన జియోభారత్

దేశంలో అందుబాటులోకి జియోభారత్ 4జి ఫోన్

మరో సంచలనానికి తెరలేపిన జియోభారత్

దేశంలో అందుబాటులోకి జియోభారత్ 4జి ఫోన్

ప్రజా దీవెన / న్యూ ఢిల్లీ :రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. జియోభారత్ 4జి ఫోన్‌ను ఇండియాలో విడుదల చేశారు. 2జి నుంచి 4జికి ప్రమోట్ చేసే క్రమంలో జియో భారత్ పేరుతో ఫోన్ లాంచ్ చేసింది. కార్బన్ కంపెనీ భాగస్వామ్యంలో ఈ ఫోన్ అందుబాటులో తెచ్చారు. దీని ధరను రూ. 999గా నిర్ణయించారు.

జూలై 7 నుంచి 1మిలియన్ జియో భారత్ 4జి ఫోన్లు మార్కెట్లోకి విక్రయించనుంది.రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. జియోభారత్ 4జి ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. 2జీ నుంచి 4జీకి ప్రమోట్ చేసే క్రమంలో ‘జియో భారత్’ పేరుతో ఈ ఫోన్ లాంచ్ చేసింది.

కార్బన్ కంపెనీ భాగస్వామ్యంలో అందుబాటులో తీసుకొచ్చింది. దీని ధర రూ. 999గా నిర్ణయించింది. జూలై 7 నుంచి 1 మిలియన్ జియో భారత్ 4జీ ఫోన్లు మార్కెట్లోకి విక్రయించనుంది. 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 14 జీబీ డేటా వస్తుంది. అదే సంవత్సరానికి అయితే 1234తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

రోజుకు 0.5 జీబీ చొప్పున మొత్తం
168జీబీ డేటా లభిస్తుంది.కాగా.. దేశంలో ఇప్పటివరకు 25 కోట్లమంది జియో మొబైల్స్ వాడుతున్నారని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్‌ అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందులో భాగంగానే జియో భారత్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ మొబైల్‌కు నెలకు రూ.123 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.
జూన్7నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.

దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ మొబైల్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని రిలయన్స్ జియో వర్గాలు తెలిపాయి. స్క్రీన్‌కింద కీప్యాడ్, జియో భారత్ బ్రాండ్‌తో ఇతర ఫీచర్ ఫోన్ మాదిరిగానే కనిపిస్తున్నా.. ఇది 4జి స్మార్ట్‌ఫోన్. దీనిలో వెనకభాగాన కెమెరా, స్పీకర్లు ఉంటాయి. దీని ద్వారా ఇండియాలో ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఫొటోలను క్లిక్ మనిపించేందుకు, యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు అనుమతిస్తుంది.

జియో సినిమా, జియో సావన్, ఎఫ్‌ఎమ్ రేడియో వంటి ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన చాలా ఆప్షన్లు ఉన్నాయి.