Elections: ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులే కీలకం
ఎన్నికలలో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు
అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి
-ఏమరపాటుగా ఉంటే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని
కలెక్టర్ హరిచందన
ప్రజా దీవెన నల్గొండ: ఎన్నికలలో సెక్టోరల్ అధికారుల (sectoral officers)పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు.లోకసభ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయం ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్ లో సెక్టోరల్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
సెక్టోరల్ అధికారులు అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ,ఏపిఓ, ఇతర సిబ్బంది విధులను సైతం తెలుసుకొని ఉండాలని, పోలింగ్ కేంద్రాలలో కనీస సౌకర్యాల కల్పనను పరిశీలించాలని, మహిళా సిబ్బందికి కనీస సౌకర్యాలైన టాయిలెట్, రాత్రి బస చేసేందుకు సదుపాయాలు ఉన్నది లేనిది పరిశీలించాలని ఆదేశించారు.
సెక్టోరల్ అధికారులు(sectoral officers) విధుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి తప్పులు చేసేందుకు ఆస్కారం ఇవ్వద్దని, విధులను సక్రమంగా నిర్వహించేందుకుగాను సెక్టోరల్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్ బుక్ ను క్షుణ్ణంగా చదవాలని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశానికి రెవెన్యూ ఆధనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ తదితరులు హాజరయ్యారు.
sectoral officers crucial role in elections