Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Israeli-Iran war: ఇరాన్ పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు

అందరూ అనుకున్నట్లే ఇజ్రాయెల్ అన్నంత పనీ చేసిoది. ఇటీవల ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశం క్షిపణలను ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన ఓ సైనికాధికారి వెల్లడించారు.

క్షిపణి దాడులకు పాల్పడిన ఇజ్రాయీల్
అమెరికాకు చెందిన ఓ సైనికాధి కారి వెల్లడి
ప్రజా దీవెన, టెహ్రాన్: అందరూ అనుకున్నట్లే ఇజ్రాయెల్(Israeli) అన్నంత పనీ చేసిoది. ఇటీవల ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశం క్షిపణలను ప్రయోగించినట్లు అమెరికాకు చెందిన ఓ సైనికాధికారి వెల్లడించారు. ఇరాన్ లో శుక్రవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే సద రు అధికారి ఈ విధంగా స్పందిం చారు. తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా పరిణా మాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్ కు ఇరాన్ (Iran)ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన రోజు వ్యవధిలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్ మిగలదని ఆయన తేల్చి చెప్పారు. ఇరాన్ లో అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్పహాన్ నగరంలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. అవి ఏంటనేది ఇంకా అక్కడి ప్రభుత్వం (government)అధికారికంగా వెల్లడించలేదు. కానీ, ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా గగనత లాన్ని మూసివేసింది. వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులను రద్దు చేసింది. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిం చారు. ఆ నగరంలో అతిపెద్ద సైనిక శిబిరంతో పాటు పలు అణు కేంద్రా లు ఉన్నాయి.

మరోవైపు ఇరాన్ తమ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అక్కడి అధి కారిక మీడియా ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైతం సిద్ధం చేసింది. గుర్తు తెలియని మినీ డ్రోన్లను ధ్వంసం చేయడానికి ఈ చర్య తీసుకొన్నట్లు ఓ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఇరాన్ మీడియా ఐఆర్ బీ వెల్లడించింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ భావిస్తోంది. ఆ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళాని కి చెందిన ఏడుగురు సైని కాధికారు లు మృతి చెందారు.

Israeli retaliatory strikes on Iran