Higher Education: ఇన్ఫర్మేషన్ రీసోర్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ పై అవగాహన
ఇన్ఫర్మేషన్ రీసోర్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే అంశం పై ఎన్జీ కళాశాల లైబ్రరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ. దుర్గాప్రసాద్ విద్యార్థులకు అవగాహన కలిగించారు.
ప్రజా దీవెన నల్గొండ: ఇన్ఫర్మేషన్ రీసోర్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్(Information Resource for Higher Education) అనే అంశం పై ఎన్జీ కళాశాల లైబ్రరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ. దుర్గాప్రసాద్ విద్యార్థులకు అవగాహన కలిగించారు. శనివారం దేవరకొండ పట్టణంలోని ఎం కె ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లైబ్రరీ విభాగం ఆధ్వర్యంలో
ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (Electronic Information Resource for Higher Education) అనే అంశం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కలిగించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. రమావత్ రవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్, హైయ్యర్ ఎడ్యుకేషన్ మీద దృష్టి సారించాలని, ఉన్నత విద్యను అభ్యసించాలని ఇంటర్నెట్ ఉపయోగాలు పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సిహెచ్. రామరాజు, జి. కోటయ్య ఇంచార్జి లైబ్రేరియన్, జి. లింగారెడ్డి, లింగయ్య ఏ. శ్రీను, వి. వెంకటేష్ తదితర అధ్యాపక, అధ్యాపకేతురులతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.
Awareness on Information Resource for Higher Education