Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bjp MP Sanjay Kumar : బోనస్ ఇవ్వలేనోళ్ళు రుణమాఫీ అంటే నమ్మేదెవరు 

--వడ్లకు బోనస్ రూ.500లు ఇవ్వకుండా రూ.30 వేల కోట్ల రుణమాఫీ అంటే నమ్మాలా --రైతుల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి తాలు, తరుగు లేకుండా వడ్లు కొనలేరా --ఆరు గ్యారంటీల అమలు అతి పెద్ద బోగస్ వాగ్దానం --మోసాలు చేయడంలో కేసీఆర్ టీంను మించిన కాంగ్రెస్ నేతలు -- కాంగ్రెస్ ను చూస్తే జాలేస్తోంది ఆ పార్టీకి అభ్యర్ధులే కరువయ్యారు --కాంగ్రెస్ కూటమికి ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పే ధైర్యం కూడా లేదు --కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ని ప్పులు చెరిగిన ఎంపి బండి సంజ య్ కుమార్

బోనస్ ఇవ్వలేనోళ్ళు

రుణమాఫీ అంటే నమ్మేదెవరు 

–వడ్లకు బోనస్ రూ.500లు ఇవ్వకుండా రూ.30 వేల కోట్ల రుణమాఫీ అంటే నమ్మాలా
–రైతుల కోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి తాలు, తరుగు లేకుండా వడ్లు కొనలేరా
–ఆరు గ్యారంటీల అమలు అతి పెద్ద బోగస్ వాగ్దానం
–మోసాలు చేయడంలో కేసీఆర్ టీంను మించిన కాంగ్రెస్ నేతలు
— కాంగ్రెస్ ను చూస్తే జాలేస్తోంది ఆ పార్టీకి అభ్యర్ధులే కరువయ్యారు
–కాంగ్రెస్ కూటమికి ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పే ధైర్యం కూడా లేదు
–కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ని ప్పులు చెరిగిన ఎంపి బండి సంజ య్ కుమార్
ప్రజా దీవెన, కరీంనగర్: రాష్ట్రంలో వడ్లకు రూ.500 రూపాయల బోన స్ ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రూ.30 వేల కోట్లను మాఫీ చేస్తామంటే నమ్మేదెవరని బీజేపీ జాతీయ ప్రధాన కా ర్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( bandi Sanjay Kum ar) ప్రశ్నించారు.

వానలతో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు తడిసి పోతున్నాయని, గతం లో ఇచ్చి న హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబందం లేకుం డా వడ్లను కొనుగోలు చేయడానికి రూ.700 కోట్లు ఖర్చు చేస్తే రైతుల కు మేలు జరుగుతుందని చెప్పారు. ఆ నిధులను కూడా సమకూర్చ లేని ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటే రైతులెవరూ న మ్మడం లేదన్నారు.

జీతాలు, అప్పులు చెల్లించడానికే నెలనెలా రూ.11 వేల కోట్లను స మకూర్చలేక అపసోపాలు పడుతున్న ప్రభుత్వం వద్ద రూ.30 వేల కోట్ల రుణమాపీ ఎట్లా చేస్తుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మోసాలు చేయడంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను మించి పోయారన్నారు.

శనివారం సాయంత్రం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజ య్ సమక్షంలో చొప్పదండి నియో జకవర్గం లోని వెలిచాలకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయ కులు పెద్ద ఎత్తున బీజేపీ ( bjp ) లో చేరారు. వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వా నించిన బండి సంజయ్ ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి ప్రసంగిం చారు.
మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను ( six guarantees) నమ్మి గెలిపిస్తే అధికారం లోకి వచ్చాక నమ్మక ద్రో హం చేసిందని ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లాలో ఎప్పుడు వర్షంపడ తదో తెల్వని పరిస్థితి ఉందని, ఇతర జిల్లాల్లో వానలు పడివడ్లు తడి సిపోతున్నయాని ఆందోళన వ్యక్తం చేశారు.

వడ్లకు బోనస్ ఇస్తా మన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 లక్షల టన్నుల వడ్లు పండాయని, బోనస్ ఇయ్యాలంటే క్వింటాలుకు రూ.500 చొ ప్పున బోనస్ ఇవ్వాలం టే రూ.3,500 కోట్లు కావాల్సి ఉంటుంద ని, అట్లాగే పత్తి, మిర్చి, మొ క్క జొన్నసహా ఇతర పంటలకు మరో రూ.1 500 కోట్లు కావాలని, అదే విధంగా తాలు, తరుగు, తేమ లేకుండా వడ్లు కొనాలంటే ప్రభుత్వం రూ.700 కోట్లు ఖర్చ పెట్టాల్సి ఉంటుం దన్నారు.

ఎందుకంటే తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు సగ టున 5 కిలోలు చొప్పున రైతు లు నష్టపోతున్నారని అవేదన వ్య క్తం చేశారు. ఈ లెక్కన బోనస్ కో సం రూ.5 వేలు కోట్లు, తాలు, తరుగు లేకుండా రూ.700 కోట్లు ఖర్చు పెడితే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అదేమీ చేయకుండా రైతులను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆగస్టు 15న రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామంటే నమ్మేదెలా అని ప్రశ్నించారు.

రుణమాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమని, ప్రభుత్వ ఖజానాలో నయా పైసా లేదని, జీ తాలు, అప్పుల కోసమే నెలనెలా రూ.11 వేల కోట్లు సమకూర్చలేక అపసోపాలు పడుతున్నారని ఎద్దే వా చేశారు. రుణమాఫీ ఎట్లా చేస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పా లని డిమాండ్ చేశారు. మోసాలు చేయ డంలో కాంగ్రెస్ నేతలు కేసీ ఆర్ ను మించి పోయారని ఆరోపించారు.

ఇప్పటికైనా కాం గ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారని వర్షాల తో రైతులు ఇబ్బంది పడుతున్నా రని, కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేవని, వెంటనే యుద్ద ప్రాతిపదికన ఇచ్చిన మాట ప్రకారం బోనస్ ఇచ్చి వడ్లను కొంటారా లేదా స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబం దం లేకుండా వడ్లను కనీస మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ ఇచ్చి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

ఎమ్మెల్యేగా ఓడిపోయిన బండి సంజయ్ ఎంపీగా పోటీ చేయడానికి కరీంనగర్ పునరావాస కేంద్రమా అంటూ వినోద్, గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆ మాట అనడానికి సిగ్గుండాలని, ఎంపీగా బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ సీటు, వినోద్ కుమార్ లక్ష ఓట్లతో ఓడిపోతే ప్రణాళిక సంఘం ఛైర్మన్, ఎమ్మెల్యేగా ఓడి పోయిన కొప్పు ల ఈశ్వర్ కు ఎంపీ సీటిచ్చారుగా మరి వాటినేం అంటారని ప్రశ్నించా రు.

నేను లోకల్. వినోద్ నాన్ లోక ల్ సిట్టింగ్ ఎంపీని, మరి ఎవరికి పునరావాస కేంద్రమో ప్రజలు ఆలోచించాలని ఇవన్నీ గమనించే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ చెంప చెళ్లు మన్పించినా వాళ్లకు సిగ్గు రాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని కూల్చాలనే ఉద్దేశం బీజేపీకి లేదని స్పష్టం చేశారు.

గతంలో బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ నుండి పలువురు ఎమ్మె ల్యేలు బీజేపీలో చేరుతామని ఆసక్తి చూపుతున్నా ఆ పద వులకు రాజీనామా చేసి వస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని చెప్పామని, ఎందు కంటే బీజేపీ సిద్దాంతాలు, విధానాలున్న పార్టీ, గతంలో ఈట ల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవులకు రాజీ నామా చేసి బీజేపీలో చేర్చుకున్న విషయాన్ని మర్చి పోవద్దని గుర్తు చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధే లేదని, 17కు 17 సీట్లు గెలవబోతున్నామని కరీంనగ ర్ లో నన్ను ఓడగొట్టడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి పనిచే స్తున్నరని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులే ఈ విషయాన్ని నాకు చెబు తున్నారని ఎవరెన్ని కుట్రలు చేసి నా మీకే ఓటేస్తామని చెబుతున్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్, బీఆర్ ఎస్ అభ్యర్ధు లు రెండో స్థానం కోసమే పోటీ పడుతు న్నారని, బీజేపీ బంపర్ మెజారి టీతో కరీంనగర్ సీటును కైవసం చేసుకోబోతోందని దీమా వ్యక్తం. దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఎక్కడ చూసినా బీజేపీ గాలి వీస్తోందని, కాంగ్రెస్ పరిస్థితి చూస్తే జాలేస్తోం దని అన్నారు.

నామినేషన్లు ప్రారం భమైన తరువాత కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకడం లేదని, దేశంలో కాంగ్రెస్ కూటమికి కెప్టెన్ (ప్రధాని) లేకుండానే బరిలో దిగుతోంది. ఇక్కడ టీం సభ్యులే కరువు య్యారని, కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్ధి గెలిచే అవకాశాలే లేవని స్పష్టం చేశారు.

దేశంలో జరిగే ఇండియన్ పొలిటికల్ లీగ్(ఐపీఎల్) పోటీల్లో 400 సీట్లతో మోదీ ఐపీఎల్ కప్ ను కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించ బోతున్నారని పునరుద్ఘాటించారు. కరీంనగర్ లో పోటీ చేస్తున్న బీఆ ర్ఎస్ అభ్యర్ధి ఎన్నడైనా ప్రజా సమస్యలపై కొట్లాడారా, ఇక్కడున్న మంత్రి గత ఐదేళ్లలో ఎన్నడైనా ప్రజల కోసం ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు.

నేను ప్రజల కోసం నిరంతరం కొట్లాడినానని, నాపై 109 కేసులు పెట్టినా భయపడకుండా కేసీఆర్ ను గద్దె దించే దాకా పోరాడానని గుర్తు చేశారు. హిందుగాళ్లు బొందుగాళ్లని హేళన చేసిన కేసీఆర్ చెంప చెళ్లు మన్పించిన చరిత్ర కరీంనగర్ ప్రజలదని, నాస్తికుల నోట కూడా జై శ్రీరాం అన్పించిన చరిత్ర తెలంగాణ ప్రజలదని వివరిం చారు.

కాంగ్రెస్ పార్టీ పీఎఫ్ఐ లాంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంటే వాళ్లకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ అని కొని యా డారు. దేశంలో, రాష్టంలో గుంట నక్కలన్నీ ఏకమైనా బీజేపీ సింహం మాదిరిగా సింగిల్ గా పోటీ చేస్తోంది. మళ్లీ ప్రభుత్వా న్ని ఏర్పాటు చేయబోతు న్నామని స్పష్టం చేశారు.