Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Iron nails: చర్లపల్లి జైలులో మేకులు మింగిన ఖైదీ

ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ రిమాండ్‌ ఖైదీ. ఏకంగా తొమ్మిది మేకులు మింగేశాడు.

ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు
చర్లపల్లి జైలులో పోలీసులు షాక్

ప్రజాదీవెన, చర్లపల్లి: ఇనుప మేకులు (Iron nails)మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ రిమాండ్‌ ఖైదీ. ఏకంగా తొమ్మిది మేకులు మింగేశాడు. కడుపునొప్పితో విలవిల లాడుతుంటే జైలు అధికారులు హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఖైదీ కడుపులో ఇనుప మేకులు ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే వాటిని తొలగించి ఖైదీ ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో మహ్మద్‌ షేక్‌ (32) అనే వ్యక్తి రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం అతనికి హఠాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి (Stomach ache)వచ్చింది. దీంతో జైలు వైద్యులు పరిశీలించి, అతన్ని వెంటనే గాంధీ ఆసుపత్రి ఖైదీల వార్డులో చేర్పించారు. డాక్టర్లు ఎక్స్‌రేలు(X-Rays) తీసి పరిశీలించి ఒక్కాసారిగా షాక్ కు గురయ్యారు. సదరు ఖైదీ కడుపులో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ఇనుప మేకులు ఉన్నట్లు వారు గమనించారు.

గాంధీ దవాఖాన గ్యాస్ట్రో ఎంటరాలజీ (Gastroenterology)విభాగం హెచ్‌వోడీ, ప్రొఫెసర్‌ శ్రావణ్‌కుమార్‌ నేతృత్వంలో శనివారం (ఏప్రిల్‌ 20) మళ్లీ వైద్యపరీక్షలు చేశారు. రోగి ప్రాణాలకు ఎటువంటి ముప్పు తలెత్తకుండా సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి ఎండోస్కోపీ ద్వారా మేకులను విజయవంతంగా తొలగించారు. సుమారు 2 నుంచి 2.5 అంగుళాల పొడవున్న తొమ్మిది ఇనుప మేకులను వారు బయటికి తీసినట్లు శనివారం మీడియాకు వెల్లడించారు. రోగి కావాలనే వీటిని మింగినట్లు తెలుస్తోందని అన్నారు. అయితే అతడు ఎందుకు మింగాడో.. అందుకు కారణాలేమిటన్న దానిపై ఆరా తీస్తున్నామని జైలు వర్గాలు తెలియజేశాయి.

Prisoner who swallowed nails in Charlapalli Jail