Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Disabled employees: దివ్యాంగులకు ఎన్నికల విధులు

సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

మహారాష్ట్రలో ఈసీ సహసోపేత నిర్ణయం
ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఏర్పాటు

ప్రజాదీవెన, హహారాష్ట్ర: సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు(Disabled employees) ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. ప్రత్యేకంగా దివ్యాంగులు పనిచేసేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ దివ్యాంగులు ఎవరికన్నా తక్కువకాదని నిరూపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీ పేర్కొంది. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొ దివ్యాంగ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఎన్నికల సంఘం.

పోలింగ్‌ కేంద్రంలో దివ్యాంగులే అన్ని విధులు నిర్వర్తించనున్నారు. దివ్యాంగులు కూడా ఏ పనినైనా చేయగలరనే సందేశాన్ని సమాజానికి ఇచ్చేందుకే ఈ పోలింగ్ కేంద్రాలను(Polling stations) ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు. దివ్యాంగ పోలింగ్ కేంద్రంలో నలుగురు దివ్యాంగ సిబ్బంది, వీరికి మరో ఇద్దరు సహకరిస్తారని పేర్కొన్నారు. ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కొక్కటి చొప్పున తొమ్మిది దివ్యాంగ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

వారికి గుణపాఠంగా ఈ పోలింగ్ కేంద్రాలు
ఎన్నికల విధుల నుంచి సెలవు కోరేవారికి దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు ఓ గుణపాఠమని ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు. ‘ఓటింగ్​కు చాలా రోజుల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. వివిధ శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులు(Govt employees)ఎన్నికల విధుల నుంచి మినహాయింపు కోరుతున్నారు. అందుకే మేము దివ్యాంగ పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేయనున్నాం. ఈ పోలింగ్ కేంద్రాన్ని చూసి ఎన్నికల విధుల నుంచి తప్పించుకోవాలనుకునేవారు గుణపాఠం నేర్చుకుంటారు. అంతేకాకుండా పురుషులు, మహిళలు సమానమని చాటిచెప్పేందుకు మహిళా సిబ్బందితో ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని ఎన్నికల అధికారి దేవేంద్ర కట్కే తెలిపారు.

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ ఎన్నికలు జరిగాయి. ఇంకా మరో ఆరు దశ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ అన్నీతానై తిరుగుతున్నారు. కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రచారం చేస్తున్నారు.

Electoral duties for persons with disabilities