Nomination :24న రఘువీర్ రెడ్డి నామినేషన్
నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ నెల 24న నల్లగొండలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని
అత్యధిక మెజార్టీ కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడాలి
పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి
నామినేషన్ సందర్భంగా పార్టీ శ్రేణులతో సన్నాక సమావేశం
ప్రజా దీవెన నల్గొండ: నల్లగొండ పార్లమెంటు(Nalgonda parliament) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఈ నెల 24న నల్లగొండలో నిర్వహించే ర్యాలీని విజయవంతం చేయాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నామినేషన్ సందర్భంగా నల్లగొండ నియోజకవర్గ పార్టీ ముఖ్యులతో నిర్వహించిన సన్నాక సమావేశంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామినేషన్ సందర్భంగా ఈనెల 24న ఉదయం 10 గంటలకు నల్గొండ పట్టణంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించుకున్న విధంగా పార్లమెంటు ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. ఈ నియోజకవర్గ నుంచి 70 వేలకు పైగా మెజార్టీ తీసుకువస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన హామీని మనమంతా నిలబెట్టుకోవాలన్నారు.ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం పాత, కొత్త అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు వివిధ శాఖల ద్వారా నల్గొండ పట్టణంతో పాటు నియోజకవర్గంలో రూ. 800 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశాడని అన్నారు.అత్యధిక మెజార్టీ కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పని చేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థలలో పోటీ చేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు.
24న జరిగే నామినేషన్ కార్యక్రమానికి మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిక్షం యాదవ్, పాల్గొని ప్రసంగించగా పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు.