Nomination: నామినేషన్ కార్యక్రమాని విజయవంతం చేయండి: నాగం వర్షిత్ రెడ్డి
పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు.
ప్రజా దీవెన నల్గొండ: పార్లమెంట్ అభ్యర్థి(Parliament elections)శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ భారీ ర్యాలీతో 30 వేల మంది కార్యకర్తలు నాయకులతో పెద్ద ఎత్తున నల్లగొండ నగరం మొత్తం ర్యాలీ, రోడ్ షో నిర్వహించుకుంటూ నామినేషన్ దాఖలు చేయనున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు కిరణ్ రిజీజు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి హాజరు అవుతున్నారని పేర్కొన్నారు. కావున నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చే
యాలని బిజెపి నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, హిందూ బంధువులు కు పిలుపునిచ్చారు అనంతరం పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ గడ్డమీద కాశయ జెండా ఎగరవడం ఖాయం. ఇది నేను అంటున్న మాట కాదు. ఎవరిని కదిలించిన, ఏ ఒక్క కార్యకర్తను కదిలించిన, ఏ ఒక్క నల్లగొండ పార్లమెంట్ ప్రజలను అడిగిన ఇదే మాట. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఢిల్లీలో నరేంద్ర మోడీ, నల్లగొండలో(sanampudi saidi reddy) శానంపూడి సైదిరెడ్డి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని కోడై కూస్తున్నారని అన్నారు. నేడు జరగబోయే ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ప్రబారి చాడ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ
నేనే అభ్యర్థి నేనే నరేంద్ర మోడీని అని అనుకుని ప్రతి ఒక్క ఓటరుని కలిసి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కొరకు పేద ప్రజల కొరకు ప్రవేశపెట్టిన చారిత్రాత్మకమైన పథకాలను నిర్ణయాలను బూతు స్థాయి లో ప్రచారం చేసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించడమే లక్ష్యంగా యుద్ధం లాగ పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్,పోతేపాక సాంబయ్య పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, జిల్లా కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి, కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, కౌన్సిలర్లు దాసరి సాయి, గుర్రం వెంకటేశ్వర్లు, నల్గొండ పట్టణ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి, నల్గొండ మండల అధ్యక్షుడు బొగరీ అనిల్ కుమార్, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, కనగల్ మండల అధ్యక్షుడు పులకరం బిక్షం,గడ్డం మహేష్, జిల్లా అధికార ప్రతినిధి పెరిక ముని కుమార్, మహిళా మోర్చా అధ్యక్షురాలు రెవల్లి కాశమ్మ, యువ మోర్చ జిల్లా అధ్యక్షుడు వంగూరు రాఖి, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
BJP candidate saidi reddy nomination