పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు ఉద్యమించాలి
కలెక్టరేట్ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి
ప్రజా దీవెన/నల్లగొండ:ఇండ్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం తో పాటు రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మీ పథకం కింద ఐదు లక్షలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పేదలు పోరు బాట పట్టారు. ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ఉన్న పేదలు భారీగా తరలివచ్చారు. ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే నినాదంతో కలెక్టరేట్ ప్రాంగణమంతా హోరెత్తింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర నాయకులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల సమస్యలను పరిష్కరించకుండా విస్మరిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది పేదలు ఇల్లు, స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ల కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నారని అయినా ఆ సమస్యలు నేటికీ పరిష్కారం కాలేదని ఆరోపించారు.
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. కట్టిన కొన్ని ఇండ్లనైనా పేదలకు పంచలేదని వృధాగా ఉండిపోయాయని పేర్కొన్నారు. ఎక్కడైతే డబల్ బెడ్ రూములు పూర్తయ్యాయి అక్కడ కావలసిన కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసి పేదలకు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సొంత స్థలాలు నా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షలు ఇస్తానని చెబుతోంది అది ఏ మాత్రం సరిపోవని ఐదు లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలను ఇస్తే కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 లక్షల రూపాయలతో పేదలు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య కూడాతీవ్రంగా ఉందని రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల ఎకరాలకు పైగా పోడు పట్టాల కోసం దరఖాస్తు చేస్తే 4.5 లక్షల ఎకరాల ఇస్తామని ప్రభుత్వంకొద్దిమందికి పొడుపట్టాలని పంపిణీ చేస్తున్నన్నారు.1,50,000 మంది గిరిజన ఇతరులు కూడాపొడుపుల కోసం దరఖాస్తు చేసుకున్నారని వారికి కూడా పొడుపట్టాలను అంది ఇవ్వాలని డిమాండ్ చేశారు. వానాకాలం సీజన్ స్టార్ట్ అయినందున ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఇండ్ల స్థలాలు, గృహ లక్ష్మీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు చెల్లించాలని జరుగుతున్న ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం ఎంక్వయిరీ చేసిన భూమిని నేటికీ పంచలేదు అన్నారు. ఆ భూములను పల్లె ప్రకృతి వనాలు రైతు వేదికలకు డంపింగ్ యార్డులకు ఇతర అవసరాల కోసం వాడుకుంటూ పేదలకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.
గృహ లక్ష్మీ పథకం కింద మూడు లక్షల రూపాయలుసరిపోవని పెరిగిన ప్రస్తుత ధరలకు అనుగుణంగా 5 లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాకు వేలాది డబుల్ పెట్టుకుని మంజూరు చేసిన నేటికి పూర్తి కాలేదని పూర్తయి నాకు కొన్నింటిని కూడా ఎక్కడ పంపిణీ చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు.
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలోకి వచ్చాక డబల్ బెడ్ రూమ్లు కట్టిస్తామని పదేపదే చెప్పారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, సయ్యద్ హశం, సిహెచ్ లక్ష్మీనారాయణ, బొజ్జ చిన్న వెంకులు, వీ వెంకటేశ్వర్లు, దండంపల్లి సరోజ, పోలబోయిన వరలక్ష్మి, మహ్మద్ సలీం, గంజి మురళీధర్, మల్ల0 మహేష్, కొండ వెంకన్న, అవిశెట్టి శంకరయ్య, మురారి మోహన్, చెరుకు పెద్దలు, కుర్ర శంకర్ నాయక్, డి రవి నాయక్, నాంపల్లి చంద్రమౌళి, నన్నూరి వెంకటరమణారెడ్డి, దండంపల్లి సత్తయ్య, మల్లు గౌతంరెడ్డి, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, కర్నాటి మల్లేశం, పెంజర్ల సైదులు, నలుపరాజు సైదులు, మన్నెం బిక్షం, రొండి శ్రీను,శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు.