Kavitha bail: కవిత కేసులో ముగిన వాదనలు
ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై మే 2న కోర్టు తుది ఉత్తర్వులు వెలువరించనుంది.
మే 2న కోర్టు తుది ఉత్తర్వులు
ప్రజాదీవెన, ఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం(Delhi liquor case)సీబీఐ కేసులో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్‌పై మే 2న కోర్టు తుది ఉత్తర్వులు వెలువరించనుంది. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు కవిత అర్హురాలు అని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని(Rouse Avenue court) కోర్టుకు విన్నవించారు. ఈడీ కస్టడీలో సీబీఐ ఎందుకు అరెస్టు చేసింది? అని ప్రశ్నించారు.
ఆమెను అరెస్ట్ చేయాల్సిన వసరం లేకున్నా.. చేశారని తెలిపారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదని వివరించారు.మరోవైపు కవితకు బెయిల్(Kavitha’s bail) ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. ఆమె దర్యాప్తును ప్రభావితం చేయగలధని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ విషయంలో మే 2వ తేదీన ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపింది.
Kavitha’s bail petition ended in Rouse Avenue court