Congress Mind Game : అభ్యర్థి ఖారారు కాలే.. జోరుగా ప్రచారం
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో ఉత్కంఠ భరితమైనా పోరు నెలకొంది.
కరీంనగర్ లోక్‌సభలో కాంగ్రెస్ మైండ్ గేమ్
నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు పొన్నంకు అప్పగింత
ప్రజాదీవెన, కరీంనగర్: కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో(Lok sabha elections) ఉత్కంఠ భరితమైనా పోరు నెలకొంది. నామినేషన్ దాఖలుకు కేవలం మూడు రోజులు గడువు మిగిలి ఉన్నా, ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు చేయలేదు. అయితే ఈ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలని పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పారు. దీంతో క్యాండేట్‌తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పొన్నం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు..
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌కు(Ponnam Prabhakar) కరీంనగర్ ఎంపీ స్థానం గెలుపు అత్యంత కీలకం. లోక్‌సభ ఎన్నికలకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందుకే ఇక్కడ అభ్యర్థితో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలంటూ గత పదిహేను రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ ఇప్పటికే వెలిచాల రాజేందర్ రావుకు మద్దతు ఇస్తున్నారు. అసెంబ్లీల (Assembly) వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. టికెట్ విషయంలో రాజేందర్ రావు, ప్రవీణ్ రెడ్డికి మధ్య పోటీ ఉన్నప్పటికీ రాజేందర్ రావుకే మద్దతు ఇస్తున్నారు పొన్నం.
అయితే అధికారిక ప్రకటన. రాకున్నా వెలిచాల రాజేందర్ రావు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్(Congress) శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడ రాజేందర్ రావు కొత్త నేత అయినప్పటికీ పొన్నం ప్రభాకరే గెలుపు బాధ్యతలు తీసుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పొన్నం ప్రభాకరే పరోక్ష అభ్యర్థిగా భావిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఏడు సెగ్మెంట్ లలో నాలుగు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
వారికే ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. ఇక, ఈ మూడు పదిహేను రోజులు పొన్నం ప్రబాకర్ కరీంనగర్ లో మకాం వేసి పార్లమెంటు పరిధిలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్న నేపధ్యంలో పొన్నం ప్రభాకర్ మరింత శ్రమించాల్సి వస్తుంది. క్యాడర్‌ను ఉత్సాహపరచి ప్రచార స్పీడ్ ను మరింత పెంచుతున్నారు.
Congress mind game Karimnagar Lok Sabha