Congress: మంత్రి సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక
నల్లగొండ మండలం చెన్నుగూడెం, దమ్మన్నగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ప్రజా దీవెన నల్గొండ: నల్లగొండ మండలం చెన్నుగూడెం, దమ్మన్నగూడెం గ్రామంలో బీఆర్ఎస్ (BRS)పార్టీకి చెందిన 20 కుటుంబాలు మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komati Reddy Venkata Reddy) సమక్షంలో క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ (Congress)పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి మంత్రి హస్తం కండువాలకు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ,నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి(Gummula Mohan Reddy), జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీటీసీ జాకిర తాజుద్దీన్, గ్రామ శాఖ అధ్యక్షుడు మర్రి సైదులు, సీనియర్ నాయకులు సతీష్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట రాకేష్, కొండల్, శ్రీను, దుబ్బాక ప్రవీణ్,కిషన్,శంకర్, ఈర్ల స్వామి, ఆరెళ్ళ సైదులు, నక్క నరసింహ, ఈర్ల నరేష్, కే.శంకర్ తదితరులు ఉన్నారు.
BRS leaders join in congress