Election polling : అదనపు బ్యాలెట్ యూనిట్ల కోసం చర్యలు తీసుకోవాలి
పోస్టల్ బ్యాలెట్, సెక్టోరల్ అధికారుల శిక్షణ, అదనపు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయవలసి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సహాయ రిటర్నింగ్ అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు.అదనపు బ్యాలెట్ యూనిట్ల కోసం చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి
ప్రజా దీవెన నల్గొండ: పోస్టల్ బ్యాలెట్, సెక్టోరల్ అధికారుల శిక్షణ, అదనపు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయవలసి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సహాయ రిటర్నింగ్ అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన(Hari Chandana) అన్నారు.
బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో లోకసభ ఎన్నికల పై వీడియో కాన్ఫరెన్స్(Video conference) నిర్వహించారు.వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చివరి రోజు నామినేషన్ల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు.
అంతకు ముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్(Vikas Raj) మాట్లాడుతూ లోకసభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజైన బుధవారం ఎక్కువ మొత్తంలో నామినేషన్లు(Nominations) వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, చిన్న చిన్న విషయాలలో ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇచ్చే పోలింగ్ శాతం పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండి వివరాలు ఇవ్వాలని, ప్రత్యేకించి 3 గంటలకు, 5 గంటలకు ఇచ్చే వివరాలు పూర్తి కక్షితమైనవిగా ఉండాలని తెలిపారు.
ఎన్నికలకు సంబంధించిన నివేదికలు సకాలంలో పంపించడం పై దృష్టి సారించాలని, ఈవీఎంల రాండమైజేషన్, పోలింగ్ సిబ్బంది ఎన్నికల పరిశీల కుల సమక్షంలో నిర్వహించే రాండమైజేషన్, పోలింగ్ రోజు నిర్వహించే మాక్ పోల్, పోలింగ్(Polling) సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన సమయంలో అన్ని నివేదికలు పంపించాలని, ప్రత్యక్షేపించి ఫిర్యాదులకు సంబంధించి తక్షణమే నివేదికలను సమర్పించాలని అన్నారు.
పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా పోలింగ్ కు ముందు రోజు, తర్వాత రోజు వచ్చే వ్యతిరేక వార్తల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. డిప్యూటీ సీఈవోలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్ కుమార్ లు ఆయా అంశాలపై సూచనలు చేశారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి శ్రీదేవి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.
Additional ballot units parliament polling