Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vattikooti Rama Rao Goud: కాంగ్రెస్ గూటికి వట్టికూటి

జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహా రాల కమిటీ ఇన్చార్జి దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ప్రజా దీవెన, హైదరాబాద్: జై గౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహా రాల కమిటీ ఇన్చార్జి దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మతతత్వ బిజెపి పార్టీ విధానాల వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిం దని, దాన్ని రక్షించాల్సిన బాధ్యత బడుగు బలహీనవర్గాలు, ప్రజాస్వా మ్య వాదులు, కుల సంఘాలు అందరూ మద్దతుగా నిలిచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

పార్టీకి అండగా నిలబడి రాహుల్ గాంధీ నాయకత్వన మతతత్వ శక్తుల్ని తరిమికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ మాట్లాడుతూ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ విదానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తానని,తన చేరికకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, టీపీసీసీ కార్యదర్శి మాదు సత్యం గౌడ్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Vattikooti Rama Rao Goud joins congress