Parliament Elections: పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హరి చందన
నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల(Parliament Elections) నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఎన్నికల పరిశీలకులకు వివరించారు.
ప్రజా దీవెన నల్గొండ: నల్గొండ జిల్లాలో పార్లమెంటు ఎన్నికల(Parliament Elections) నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన ఎన్నికల పరిశీలకులకు వివరించారు. శుక్రవారం తన చాంబర్లో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, జిల్లా వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకులు అమోఘ జీవన్ గాంకర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, జిల్లా ఎస్పీ చందన దీప్తి, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో పార్లమెంట్ ఎన్నికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
జిల్లా ఎన్నికల ప్రణాళికపై(Election planning) ఆమె పవర్ పాయింట్ ప్రజెంటేషన్(Power point presentation) ద్వారా వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలు, అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాలు సమస్యాత్మక కేంద్రాలు, ఎన్నికల విధులు నిర్వహించేందుకు నియమించిన సిబ్బంది, నోడల్ టీములు, తదితర అన్ని అంశాలను క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Parliament elections arrangements completed