Election Observers: ఎంసీఎంసీ కేంద్రాన్ని తనిఖీ చేసిన
లోక సభ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని, సోషల్ మీడియా, సువిధ, ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్, సి విజిల్ తదితర విభాగాలను జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, తదితర అధికారులు తనిఖీ చేశారు.
ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి
పాల్గొన్న జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, సూర్యాపేట కలెక్టర్ వెంకట్రావు
ప్రజా దీవెన నల్గొండ: లోక సభ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(Media Certification Monitoring Committee) కేంద్రాన్ని, సోషల్ మీడియా, సువిధ, ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ కంట్రోల్ రూమ్(Integrated Discrete Control Room), సి విజిల్ తదితర విభాగాలను జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి, ఎన్నికల వ్యయ పరిశీలకులు కళ్యాణ్ కుమార్ దాస్, పోలీస్ పరిశీలకులు అమోగ్ జీవన్ గాంకర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(Media Certification Monitoring Committee) నిర్వహిస్తున్న రిజిస్టర్లు, సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన ప్రకటనల గుర్తింపు, పెయిడ్ న్యూస్ స్కానింగ్, రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తదితర రిజిస్టర్ లను తనిఖీ చేశారు.అనంతరం సోషల్ మీడియా విభాగాన్ని సందర్శించి సోషల్ మీడియా(Social media posting) పోస్టింగ్ లను పరిశీలన చేశారు. ఆ తర్వాత సువిధ ద్వారా ఇచ్చే అనుమతులు, సి-విజిల్ యాప్ కు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కారం, తదితర విభాగాల సందర్శన సందర్భంగా ఆయా రిజిస్టర్ లను తనిఖీ చేసి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, ఎం సి ఎం సి మెంబర్ సెక్రటరీ, డిపిఆర్ఓ యు. వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్ఫర్మేటిక్ అధికారి గణపతిరావు, ఇతర జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.
Media Certification Monitoring Committee