Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth reddy Speech: సెమీఫైనల్స్ లో కేసిఆర్ ను ఓడించాం… ఫైనల్స్ లో మోదీ ని ఓడిద్దాం

అసెంబ్లీ ఎన్నికలతో సెమీ ఫైనల్‌ మ్యాచ్ లో కేసీఆర్‌ను ఓడించామని, లోక్సభ ఎన్నికలతో ఫైనల్ మ్యాచ్ లో మో దీని ఓడిద్దామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.

ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలను సో షల్‌ మీడియా వారియర్స్‌ తిప్పి కొట్టాలి
అన్నట్లుగానే పంద్రాగస్టులోగా రుణమాఫీ చేసి చూపిస్తాం
ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే బ్యాంకులకు ఎడమ చేత్తో చెల్లించే స్తాం
కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వారియ ర్స్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి

 

ప్రజా దీవెన, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలతో(Assembly elections) సెమీ ఫైనల్‌ మ్యాచ్ లో కేసీఆర్‌ను ఓడించామని, లోక్సభ ఎన్నికలతో ఫైనల్ మ్యాచ్ లో మో దీని ఓడిద్దామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌ను ఎలాగైనా ఓడించాలని చూస్తున్న మోదీ, అమిత్‌షా, కిరాయి మనుషులను పెట్టుకుని తప్పుడు వార్తలు ప్రచా రం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియ ర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం పై కొనసా గుతున్న దుష్ప్రచారాలను తిప్పికొ ట్టాలని సూచించారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా(Congress Social Media) వారి యర్స్‌తో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తు న్నానని, హరీశ్‌రావు తన రాజీనా మా లేఖను రెడీగా పెట్టుకోవాలని రైతులు తమ కుటుంబమేనని, వారికి రుణమాఫీ చేయకపోతే తమకు అధికారం ఎందుకని వ్యాఖ్యానించారు. రుణ మాఫీకి రూ.40 వేల కోట్ల వరకు అవు తాయని, ఇవి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టులో దోచుకున్న రూ.లక్ష కోట్ల కన్నా హైదరాబాద్‌ చుట్టూ ఆక్రమిం చుకున్న వేలాది ఎకరాల కన్నా ఎక్కువ అని వివరించారు. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే రుణ మాఫీకి అయ్యే రూ.40 వేల కోట్లను ఎడమ చేత్తో బ్యాంకులకు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసే బాధ్యత తనదని చెప్పారు మోసం చేయాల నుకున్న ప్రతిసారీ హరీశ్‌రావుకు అమరవీరుల స్తూపమే గుర్తుకు వస్తుందని అమరవీరుల స్తూపాన్ని తన మోసానికి ముసుగులా హరీశ్‌ రావు మార్చుకున్నారని విమ ర్శించారు. హరీశ్‌రావు అతితెలివి ప్రదర్శిస్తున్నడని చాంతాడంత లేఖను రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నడు. తన మామ చెప్పిన సీస పద్యాన్నంతా లేఖలో రాసు కొచ్చిండని, రాజీనామా లేఖ అలా ఉండదని, స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీ నామా లేఖ లేకపోతే ఆ రాజీనామా చెల్లదని, ఆయన తెలివి మోకాళ్ల నుంచి అరికాళ్లలోకి జారినట్టుందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ను వెంటాడుతు న్నారు… కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలతో వెంటాడు తున్నారని సీఎం రేవంత్‌ వ్యాఖ్యా నించారు.అధికారంలో ఎవరున్నా ఫర్వాలేదు కానీ ఈయన పోతే చాలు అన్నకాడికి బీఆర్‌ఎస్‌ వాళ్లు వచ్చారని, కేసీఆర్‌, కేటీఆర్‌కు మన ల్ని చూస్తేనే ఒంటిపైన పాములు, జెర్రులు పారినట్లు, పాయింట్‌ పచ్చిగైనట్లు ఉన్నదని, అందుకని వారు ఎవరితోనైనా కలుస్తారని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లు ఇస్తే ఏడాదిలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తదని కేటీఆర్‌ అంటు న్నడని ఎట్లొస్తది, ఇక్కడ మేమేమై నా అల్లాటప్పగ ఉన్నమా అంటూ మండిపడ్డారు.

సోషల్‌ మీడియా వారియర్లు అప్రమత్తంగా ఉండి ఈ కుట్రలను తిప్పికొట్టాలని సూచిం చారు. ప్రజాస్వామ్యంపై, రిజర్వేష న్లపై బీజేపీ దాడులు చేస్తోందని, దీనికి మతాన్ని, ఏజెన్సీలనూ ఉప యోగించుకుంటోందని ధ్వజమెత్తా రు. తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, బోనాల పండుగ నిర్వహించడం కల్వకుంట్ల కవిత నేర్పిందనట్లుగా వ్యవహరిస్తే, శ్రీరామనవమి(Sri Ram Navami), హను మాన్‌ జయంతి( Hanuman Jayanti) నిర్వహించడం బండి సంజయ్‌, అరవింద్‌ కుమార్ లు నేర్పినట్లు వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. భగవంతుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని పునరుద్ఘాటిం చారు. బీజేపీ భావజాలం ఆర్‌ఎస్‌ ఎస్‌ నుంచి వచ్చిన భావజాలమని, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ విధానమని, ఆర్‌ఎస్‌ ఎస్‌ తరహాలోనే దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేష న్లను రద్దు చేయాలన్నది బీజేపీ విధానమని స్పష్టం చేశారు.

మోదీ బ్రిటిష్‌ విధానంతో దేశాన్ని ఆక్రమిం చుకోవాలని చూస్తున్నారని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంపై దాడి చేస్తున్నా రని ఆరోపించారు. బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ అని వ్యాఖ్యా నించారు.ప్రధాని మోదీ కాలనాగు లాంటివాడని తెలిపారు. ఆయన అనుకున్నది జరగకపోతే పగ పడ తారని, పగ పెట్టుకుంటారని తెలి పారు. మోదీ, అమిత్‌షాకు, అదా నీ, అంబానీ తోడయ్యారని, ఈ నలుగురు కలిసి దేశ సంపదను దోచుకొనేందుకు ప్రయత్నిస్తున్నా రని ఆరోపించారు. రిజర్వేషన్లు పోవాలనుకుంటేనే బీజేపీకి ఓటేయండని, (Reservations) రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు పెంచాలి అనుకుంటే మాత్రం కాంగ్రెస్‌కు అండగా నిలవాలని కోరారు. గడిచిన పదేళ్లపాటు కేంద్రంలో మోదీ దుర్మార్గ పాలనను 140 కోట్ల మంది ప్రజలు చూశారని, రాష్ట్రంలో పదేళ్ల పాటు నిరంకుశ పాలన చూశారని వ్యాఖ్యానించారు. వీరిద్దరు కలిసి వంద రోజుల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన తమను ఓడించా లని ఎందుకు చూస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు.

Congress defeat modi in finals