Sudarshan kriya : సుదర్శన క్రియతో మానసిక ప్రశాంతత
యోగ, సుదర్శన క్రియ, మెడిటేషన్ చేయ డం వల్ల ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకుడు రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు.
సుదర్శన క్రియతో మానసిక ప్రశాంతత: ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకుడు శ్రీనివాసరావు
ప్రజా దీవెన, చిట్యాల: యోగ(Yoga), సుదర్శన క్రియ(sudarshan kriya), మెడిటేషన్(Meditation)
చేయ డం వల్ల ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత(Peace mind) లభిస్తుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకుడు రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రా మంలో గుత్తా వెంకట్ రెడ్డి మెమో రియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఆయన మాట్లాడుతూ మనసును తన ఆధీనంలోకి తీసు కురావడమే సుదర్శన క్రియ అన్నా రు.
వర్తమానంలో పొందే ఆనందం కూడా ఈ క్రియలో భాగమన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ద్వారా హ్యాపీనెస్ ప్రతి ఒక్కరికి అందిం చాలని దృూడసంకల్పంతో ప్రతి ఒక్కరు ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ వాలంటీర్ ఉమా వామప్, యోగా సనాలు వేయించడం జరిగింది. ఈ సుదర్శన క్రియ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్(Art of Living Course) ఒత్తిడిని పారదోలి ఆచరణాత్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని మరియు జీవశక్తిని పెంపొందిస్తుంది అన్నారు. దీని ద్వారా ధ్యానం మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలను చక్కగా పొందుతారు. శారీరక మరియు మానసిక బలహీనత నుండి విముక్తి చెందుతారన్నారు. ఎటువంటి రోగానైనా నయం చేసి శక్తి సుదర్శన క్రియకు(sudarshan kriya) ఉన్నద న్నారు. ఈ సుదర్శన క్రియ కార్యక్రమంలో కొనేటి యాదగిరి, ఏరుకొండ నరసింహ, బొడ్డు శీను, పాకాల దినేష్, పాకల సత్యనా రాయణ, చెరుకు సైదులు, పట్ల జనార్ధన్, మర్రి రమేష్ బోయ స్వామి, పల్లపు నోవేందేర్, గంగాపురం వెంకన్న, మేడబోయిన శ్రీను, చెరుకు వెంకన్న, కురుపాటి లింగయ్య, బొంగు శంకరయ్య, బెలిజ దిలీప్, పల్లపు రాకేష్, పల్లపు సాయి, పల్లపు భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
Peace mind with sudarshan kriya