Congress: కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు
నల్లగొండ జిల్లా పరిషత్ ఫైనాన్స్ కమిటీ మెంబర్, జెడ్ పి టి సి పాశం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతం పేట ఎంపీటీసీ బంతిలాల్, మాజీ దళిత బంధు డైరెక్టర్ లపంగి నరసింహ, మాజీ బీ అర్ ఎస్ అధ్యక్షుడు రజాక్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు
ప్రజా దీవెన, హైదరాబాద్: నల్లగొండ జిల్లా పరిషత్ ఫైనాన్స్ కమిటీ మెంబర్, జెడ్ పి టి సి పాశం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతం పేట ఎంపీటీసీ బంతిలాల్, మాజీ దళిత బంధు డైరెక్టర్ లపంగి నరసింహ, మాజీ బీ అర్ ఎస్ అధ్యక్షుడు రజాక్ లు కాంగ్రెస్(Congress Party) పార్టీలో చేరారు. మర్రిగూడ మండలానికి చెందిన బీ అర్ ఎస్ కు చెందిన పలువురు ప్రజా ప్రతిని ధులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబర్ మర్రిగూడ జెడ్ పి టి సి పాశం సురేందర్ రెడ్డి తెలి పారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో ప్రజాప్రతినిధులు సీని యర్ నాయకులు వందల సంఖ్య లో చేరుతున్నారని, మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగో పాల్ రెడ్డి(Komati reddy raja gopal reddy) సమక్షంలో కండువ కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా శనివారం ఆంతంపేట ఎంపిటిసి నేనావత్ బంతిలాల్, జిల్లా దళిత బంధు మాజీ డైరెక్టర్ లపంగి నరసింహ లకు శాసన సభ్యులు రాజగోపాల్ రెడ్డి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. వారితో పాటు పలువురు బీ అర్ ఎస్(BRS) కార్యక ర్తలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిం చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్, తిరుగాళ్ల పల్లి ఎంపీటీసీ గండికోట రాజమణి హరికృష్ణ, బీమనపల్లి ఎంపీటీసీ సిలివేరు విష్ణు, లెంకలపల్లి మాజీ సర్పంచ్ పాక నగేష్, మాదగోని జంగయ్య, గంట కృష్ణ, అయితారాజు స్వామి, శ్రీశైలం, సూరిగి ముత్తయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
BRS party leaders join in congress party