Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sanampudi saidi reddy: దేశంలో మోదీ ప్రభంజనం

దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ ప్రభంజనం కొనసాగుతుందని నల్లగొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గం కొండమ ల్లెపల్లి మండలంలో కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు.

కొండ మల్లెపల్లి కార్నర్ మీటింగ్ లో నల్లగొండ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

ప్రజా దీవెన, కొండమల్లెపల్లి: దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోదీ(Prime minister modi) ప్రభంజనం కొనసాగుతుందని నల్లగొండ బిజెపి ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి(Sanampudi saidi reddy) పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గం కొండమ ల్లెపల్లి మండలంలో కార్నర్ మీటింగ్ లో ఆయన ప్రసంగించారు. మీ నాయ కుడు ఎవరంటే మోడీ అంటున్నారని, ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ ఏందంటే మోడీ ఎలక్షన్ మా ఇంటి మనిషి మా మనిషి అంటా ఉన్నారని వివరించారు. దేశం మొత్తం ఒకటే అంటుందని, మేమందరం మోడీ పరివారమం టొందని చెప్పారు.మోడీకి(Modi) కుటుం బం లేదని, మోడీ భార్య, పిల్లలు లేరని, మోడీ గారికి ప్రజలకు సేవ చేయడం కోసం ఆయన 24 సంవత్సరాల నుంచి ముఖ్యమం త్రిగా, ప్రధానమంత్రిగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నీతిగా న్యాయంగా పని చేస్తున్నారని వివరించారు.

పరిపాలన ఒక మోడీగారు తప్ప ఇంకా ఎవరు చేసి చూపించలేరని, అదే మీకు కాంగ్రెస్ పరిస్థితి తెలుసు కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ, కాంగ్రెస్ అంటే దోచుకు నే పార్టీ కాంగ్రెస్ దాచుకో వాలా దోచుకోవాలా తప్ప వాళ్ళు కొత్తగా చేసేది లేదు దేశం కోసం ఆలోచించేది లేదని దుయ్యబట్టా రు. ఎన్నికల ముందు ఎక్స్ గ్రేషియా ఇస్తా అని చెప్పి ఇంతవర కు ఇవ్వలేదని, మన నీళ్లు ఆంధ్రకి తీసుకపోతున్నారు కానీ మనకు మాత్రం నీళ్లు వదిలే పరిస్థితి లేదు చివరికి సాగునీరు పోతే పోయింది తాగునీరు అన్న వదిలిపెట్టండి వాళ్ళు దాని గురించి ఆలోచించలే దు, చివరికి మేము బిజెపి(BJP) నుంచి పోయి మునగాల దగ్గర గేట్లు పగలగొడతామంటే అప్పుడు ఒక రెండు రోజులు వదిలిపెట్టిండ్రని గుర్తు చేశారు. ఏం కావాలా ఈ దేశానికి ఏమి ఇయ్యాలని చూసే నాధుడు లేడు వాళ్ళు ఎంతసేపటికి ఉత్తంకుమార్ రెడ్డి నా భార్యకు పదవి కావాలా, జానారెడ్డి రెండో కొడుకు ఎంపి కావాలా తప్ప జనా నికి ఏం కావాలని చూసేది లేదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టులో రూ. 2 లక్షల రుణమాఫీ అంటాడు, ఈ ప్రమాణాలు చేసిది కాదు ఎంతసేపటికి ఈ కాంగ్రెస్ లో దేశం మొత్తం చూడండి కాంగ్రెస్ ఎక్కడ పరిపాలించిన ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు తప్ప ఏమి ఉండవని ఎద్దేవా చేశారు. ఒక్కసారి ఆలోచించండి ఇవాళ 600 సంవత్సరాలు రాముడు అయో ధ్యలో పుట్టిన రాముడికి గుడి కట్టకుండా కూర్చుండ్రు కానీ ఇయాల రాముడు గుడి కట్టడం కోసమే ఒక యుగ పురుషుడు పుట్టిండు మోడీ, ఇయాల 600 సంవత్సరాల నుండి హిందువుల కల గుడి కట్టించిండు.

కాంగ్రెస్ పాలనలో కాశ్మీర్ మందిరం మంది కానీ ఇప్పుడు కాశ్మీర్లో ఇండియా హక్కులు భారతదేశం పరిధిలో లేదు ఎందుకంటే ఎంతసేపటికి దాన్ని ఒక దూరపు దేశం లాగా చూసేవారని వివరించారు. ఇపుడు అదే మోడీ పాలనలో కాశ్మీరు ను మన దేశం పరిధిలో కి తీసుకోవడం జరిగిందని, ప్రజలారా ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి అని కోరారు. పార్లమెంట్ ఎన్నికలలో (Parliament elections)మోదీ గెలిపిస్తే మన దేశం లో ఎన్నో అద్భుతాలు సృష్టించ వచ్చని, దేశంలోకి చొరబా టుదా రులు, ఉగ్రవాదులకు అడుగుపె ట్టకుండా చూసిన ఘనత మోడీ గారిది అని కొనియాడారు. అందుకే ఆలోచించి మోడీ గెలిపించండి, దేశ అభివృద్ధి కి తోడ్పడండి భారత్ మాతాకి జై అంటూ నినదించారు.

Sanam says modi wins in Parliament elections