Thursday, November 5, 2026
More
    HomePoliticsAI-Based Land Dispute Resolution : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భూ వివాదాల పరిష్కారమా ?

    AI-Based Land Dispute Resolution : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో భూ వివాదాల పరిష్కారమా ?

    📰 Generate e-Paper Clip

    –జనగామ కలెక్టర్ ఉత్తర్వులపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం –ఆదేశాలు తాత్కాలికంగా సస్పెండ్

    AI-Based Land Dispute Resolution : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభు త్వ కార్యాలయాల్లో ప్రజల ఫి ర్యాదుల పరిష్కారానికి ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విని యోగిస్తున్న తీరుపై తెలంగాణ హైకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తిం ది. ముఖ్యంగా ప్రజల ఆస్తి హ క్కులకు సంబంధించిన భూ వి వాదాల్లో ఏఐ రూపొందించిన స మాచారాన్ని ఆధారంగా చేసుకు ని అధికారులు నిర్ణయాలు తీసు కోవడంపై తీవ్ర అభ్యంతరం వ్య క్తం చేసింది. ఈ క్రమంలో జనగా మ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్త ర్వులను తాత్కాలికంగా నిలిపివే స్తూ కీలక ఆదేశాలు జారీ చేసిం ది. వివరాల్లోకి వెళితే..జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద మడూరు గ్రామానికి చెందిన మే డిపల్లి కొమురయ్య తన భూ వి వాదంపై హైకోర్టును ఆశ్రయించా రు. ప్రత్యర్థులు సమర్పించిన ఫి ర్యాదుపై జిల్లా కలెక్టర్ గత సె ప్టెంబర్ 8న ఉత్తర్వులు జారీ చే శారని, అయితే తన వాదనలు వినకుండానే, భూమికి సంబం ధించిన రికార్డులు, వాస్తవాలను పూర్తిస్థాయిలో పరిశీలించకుం డానే ఏకపక్ష నిర్ణయం తీసుకు న్నారని పిటిషనర్ ఆరోపించారు.

    ఏఐతో ఉత్తర్వుల తయారీపై అభ్యంతరం

    పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం. మాధవరెడ్డి వాదనలు విని పిస్తూ.. అధికారులు ఏఐ టూల్స్ ద్వారా రూపొందించిన సమా చా రాన్ని ఆధారంగా చేసుకుని ఉత్త ర్వులు జారీ చేశారని, స్వతంత్రం గా విచారణ జరిపి నిర్ణయం తీ సుకోలేదని కోర్టు దృష్టికి తీసుకె ళ్లారు. ఈ వ్యవహారంపై జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు.భూమి, ఆస్తి హక్కు ల కు సంబంధించిన వివాదాల్లో సం బంధిత పత్రాలను క్షుణ్ణంగా పరి శీలించడం, వాస్తవాలను నిర్ధారిం చడం, ఇరుపక్షాల వాదనలు వి నడం అధికారుల బాధ్యత అని కోర్టు స్పష్టం చేసింది. కేవలం ఏఐ రూపొందించిన సమాచారంపై ఆ ధారపడి కీలక నిర్ణయాలు తీసు కోవడం సమంజసం కాదన్న అ భ్యంతరాలను పరిగణనలోకి తీ సుకుంది.

    కలెక్టర్ ఉత్తర్వులకు తాత్కాలిక బ్రేక్.. అధికారులకు నోటీసులు!

    ఇరుపక్షాల వాదనలు పరిశీలించి న హైకోర్టు.. సెప్టెంబర్ 8న జనగా మ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వు లను తాత్కాలికంగా నిలిపివే సిం ది. ఈ వ్యవహారంపై రెవెన్యూ శా ఖ ముఖ్య కార్యదర్శి, జనగామ జిల్లా కలెక్టర్, దేవరుప్పుల తహ సీల్దార్‌తో పాటు సంబంధిత ప్రై వేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది.ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించిందని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ హరిత కోర్టు కు వివరించారు. తదుపరి చర్య లపై అడ్వకేట్ జనరల్ కార్యాల యాన్ని సంప్రదించినట్లు తెలిపా రు.

    బాధ్యులపై చర్యలేమిటి? 18న మరోసారి విచారణ.

    ఈ వ్యవహారంలో బాధ్యులైన అ ధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఇ ప్పటివరకు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అనే వివరాల ను సమర్పించాలని అడ్వకేట్ జ నరల్ ఏ. సుదర్శన్ రెడ్డిని హైకో ర్టు ఆదేశించింది. తదుపరి విచా రణను నవంబర్ 18వ తేదీకి వా యిదా వేసింది.

    టెక్నాలజీకి హద్దులు ఉండాలా?

    ప్రభుత్వ పాలనలో ఏఐ వినియో గం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మా రింది. ఫిర్యాదుల నమోదు, స మాచార విశ్లేషణ, ఉత్తర్వుల ముసాయిదాల తయారీలో ఏఐ ఉపయోగపడవచ్చు. అయితే ప్ర జల భూములు, ఆస్తి హక్కుల ను ప్రభావితం చేసే నిర్ణయాలను యంత్రాలు రూపొందించిన స మాచారానికే పరిమితం చేయ డం ప్రమాదకరమనే ఆందోళ న లు వ్యక్తమవుతున్నాయి. పరిపా లనలో వేగం కోసం సాంకేతికత ను వినియోగించినా.. తుది నిర్ణ యం తీసుకునే ముందు వాస్త వాలను స్వయంగా పరిశీలించ డం, సంబంధిత వ్యక్తులకు న్యా యం చేయడం అధికారుల బా ధ్యత. జనగామ భూ వివాదంపై హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు ప్ర భుత్వ యంత్రాంగంలో ఏఐ విని యోగం, అధికారుల జవాబు దా రీతనంపై కీలక చర్చకు తెరలేపా యి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.