K omati Reddy Covert Operation : రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘కోమటిరెడ్డి ‘ కోవర్ట్ ఆపరేషన్
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్ట్ ఆపరేషన్ చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర స్ధాయిలో సంచలన ఆరోపణలు సంధించా రు.
22 మంది ఎమ్మెల్యేలతో వస్తా కేసీఆర్ తో మాట్లాడమన్నది అతనే
ప్రజల్లో విశ్వాసం లేని వెంకట్ రెడ్డి మాటలు ఎవరూ నమ్మరు
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆసక్తికర ఆరోపణలు
ప్రజా దీవెన, కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy venkat reddy) కోవర్ట్ ఆపరేషన్(Covert Operation) చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Padi kaushik reddy)తీవ్ర స్ధాయిలో సంచలన ఆరోపణలు సంధించా రు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు నా దగ్గర ఉన్నా రని, కేసీఆర్ తో మాట్లాడాలని స్వ యంగా నాతోనే చెపాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై ఆసక్తికర ఆరోపణలు చేశారు. శని వారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ నివాసంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కోమటిరెడ్డి వెంకట రెడ్డి కి ప్రజల్లో ఏమాత్రం విశ్వాసం లేని వ్యక్తి అని, ఆయన మాటలపై నమ్మకం లేకనే నేను ఈ విషయా న్ని ఇప్పటి వరకు కేసీఆర్ కు కానీ, కేటీఆర్ కు కానీ చెప్పలేదని వివరిం చారు. వెంకట్ రెడ్డి ఓ మంత్రిగా కాకుండా మూర్ఖుడిలా మాజీ మంత్రి హరీష్ రావు పై మాట్లాడు తున్నాడని ధ్వజమెత్తారు. నిజంగా నువ్వు మొగోడివి అయితే హరీశ్ రావు రాజీనామా సవాల్ ను స్వీక రించాలని డిమాండ్ చేశారు.
ఓ మంత్రిగా కనీస సబ్జెక్టు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని దుయ్య బట్టారు. వచ్చే ఆగస్టు 15లోగా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తా మంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నాడని, సీఎం హామీలపై నమ్మకం లేకనే హరీశ్ రావు రాజీనామా సవాల్ చేశారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి నిజంగా రుణమాఫీ చేస్తాడని అనుకుంటే హరీశ్ రావు సవాల్ ను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు.
హరీశ్ రావు (Harish rao)రాజీనామా పత్రం పట్టుకొని వస్తే కోమటిరెడ్డి ఇంట్లో కూర్చొని మతిలేని మాటలు మాట్లాడుతు న్నాడని విమర్శించారు. ఏ ఫార్మా ట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో హరీశ్ రావు నుంచి రాజీనామా లేఖ తీసుకొస్తానని, మరి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి లు తమ రాజీనామా లేఖలను కూడా తీసుకురావాలని సవాల్ విసిరారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బండ శ్రీని వాస్, గెల్లు శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ పాల్గొన్నారు.
Komati Reddy venkat reddy Covert Operation