Vote: ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత కీలకం
ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, చదువుకున్నవారు నడుం బిగించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు తెలిపారు.
సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు
ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, చదువుకున్నవారు నడుం బిగించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని సమాచార హక్కు(Right Information)పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు తెలిపారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణ ఓటరు చైతన్యం సీ- విజిల్ యాప్ పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు.
దేశంలో లోక్ సభ ఎన్నికల ప్రక్రియ కొనసాగు తున్నదని చెప్పారు. ఊరు, వాడ, పల్లె, పట్నం అన్ని చోట్ల ఎన్నికల సందడి కొనసాగుతున్నది. పేదలు, నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకుంటుండగా పట్టణ ప్రాంతాలలో చదువుకున్నవారు, సాప్ట్ వేర్ ఉద్యోగులు(Software employees)ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గుతున్నది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనది. ఎన్నికలలో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి.
ఒక వేళ అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాకు ఓటు(Vote) వేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు ను వేయకుండా వృధా చేయవద్దు. ఎన్నికలలో అక్రమాల నిరోధానికి సీ- విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అక్రమాలపై పిర్యాదు చేయాలి. ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటర్లుగా మనం భాద్యతగా ఓటు వేసి మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. అందుకు మీరంతా సిద్ధం కావాలి. ఈ ఎన్నికలు మన దేశ ఆర్థిక, సామాజిక భవిష్యత్తును మన అభివృద్ధిని నిర్దేశిస్తాయి.
ఓటు హక్కు పొందడం ఎంత ముఖ్యమో ఓటు వేయడం అంతే ముఖ్యం. అన్ని వర్గాల ప్రజలు కులం, మతం, పేద, ధనిక అన్న తేడా లేకుండా ఓటు హక్కు వినియోగించుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలనీ కోరారు. పోటీ చేసే అభ్యర్థుల ఎవరూ నచ్చని పక్షంలో నోటా(Nota) కు ఓటు వేయాలి తప్ప ఓటును విస్మరించి వద్దు అని సూచించారు. మన రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరుగుతున్నందున ఇంట్లో ఉండకుండా పోలింగ్ స్టేషన్ కు వెళ్ళి తప్పనిసరిగా ఓటు వేయాలని కోరారు.
సదస్సుకు అతిథిగా విచ్చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ డా.వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 2005లో యూపీఏ ప్రభుత్వం దేశానికి సమాచార హక్కు చట్టం పేరుతో గొప్ప చట్టాన్ని తెచ్చిందని చెప్పారు. పాలనలో పారర్శకత, జవాబుదారి తనం తేవడం కోసం ఈ చట్టం తీసుకు వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ప్రతి సమాచారాన్ని పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉందన్నారు. సమాచార హక్కు చట్టం ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జల సాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్యార్ల సత్యనారాయణ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లా ప్రజలకు పాలకులు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో జలసాధాన సమితి ఆధ్వర్యంలో 600కు పైగా నామినేషన్లు(Nominations) వేసి సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్ళాం అని చెప్పారు . దాదాపు 400 కు పైగా బరిలో నిలవడంతో ఎన్నిక వాయిదా వేసి మళ్ళీ నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.
దీని వల్ల ఫ్లోరైడ్ తో బాధపడుతున్న నల్గొండ జిల్లా ప్రజల సమస్య ప్రపంచం దృష్టికి వెళ్ళింది. ఫలితంగా పాలకులు కదిలారు. సమస్యపై దృష్టి పెట్టారు. ఎన్నికల రోజు సెలవు అని నిర్లక్ష్యం చేయకుండా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఓటు వేసి మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్నెబోయినా ఉషారాణి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ సాంస్కృతిక విభాగం కళాకారులు పాటల ద్వారా ఉత్తేజపరిచారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మాజీ చీఫ్ ఇంజనీర్ ఏం.ఏ.కరీం, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ సయ్యద్ లుక్ మాన్ఆలీ, సామాజిక కార్యకర్త డా. వీ.వీ.రావు, ఎన్ ఎస్ ఎస్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి రామకృష్ణ,
సమాచార హక్కు పరిరక్షణ సమితి సాం సాంస్కృతిక విభాగం కన్వీనర్ జోగు జ్యోతి, మహిళా కోఆర్డినేటర్ వరలక్ష్మి, అధికార ప్రతినిధి శివాజీ, మేఖల శ్రీహరి, గాదం యాదగిరి, అజయ్, అజమత్ఆలీ, కంచుకట్ల మనీకుమార్, వివిధ యూనివర్సిటీల ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్లు ఆర్ష, శోభారాణి, రత్నశ్రీ, సత్యనారాయణ, కృష్ణ, సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ సభ్యులు, కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Youth vote key role in democracy