Polling: పోలింగ్ అయ్యేవరకు 3 విడతలలో తనిఖీ
లోక సభ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన రోజువారి ఎన్నికల ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్ పోలింగ్ అయ్యేవరకు 3 విడతలలో తనిఖీ చేయనున్నట్లు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు సూచించిన తేదీలలో హాజరుకావాలి
గైర్హాజరైతే వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదన
కలెక్టర్ హరిచందన దాసరి
ప్రజా దీవెన నల్లగొండ: లోక సభ ఎన్నికల (Lok Sabha elections)పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన రోజువారి ఎన్నికల ఖర్చుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఐఆర్ఎస్ అధికారి కళ్యాణ్ కుమార్ దాస్(Kalyan Kumar Das)పోలింగ్ అయ్యేవరకు 3 విడతలలో తనిఖీ చేయనున్నట్లు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన(Dasari Harichandana) సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మే 3 వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మొదటి విడత అభ్యర్థుల రోజువారీ ఖర్చుల వివరాలను తనిఖీ చేయడం జరుగుతుందని, రెండవ విడత మే 7 వ తేదీన మూడో విడత, మే 11వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తనిఖీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
అందువల్ల లోక సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వారి ఎన్నికల ఖర్చులకు సంబంధించిన రోజువారి వివరాల రిజిస్టర్లతో పైన తెలిపిన తేదీలలో హాజరుకావాలని ఆమె కోరారు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు ఖర్చుల వివరాల తనిఖికి గైర్హాజరైతే అట్టి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.
Check in 3 phases till polling