Art of Living Happiness : ముగిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ కార్యక్రమం
సుదర్శన క్రియ నిత్యం సాధన వల్ల ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు.
ప్రజా దీవెన చిట్యాల: సుదర్శన క్రియ నిత్యం సాధన వల్ల ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ది ఆర్ట్ ఆఫ్ లివింగ్(Art of Living Happiness )ఫౌండేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాసరావు అన్నారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి(Gutta Amit Reddy)సహకారంతో ఆసంస్థ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన సుదర్శన క్రియ, యోగాసనాలు, మెడిటేషన్, హ్యాపీ నెస్ కార్యక్రమం శిక్షణ శిబిరాన్ని మంగళవారం ముగిసింది.
ఈ కార్య క్రమంలో గుత్తా వెంకట్ రెడ్డి(Gutta Venkat Reddy) ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి పాల్గొని యోగా గురువును శాలు వాతో సన్మానించారు. ఉరుమడ్ల గ్రామంలో నిర్వహించిన సుదర్శన క్రియ కోర్సుకు సహకారం అందిం చిన గుత్తా అమిత్ కుమార్ రెడ్డిని గురూజీ శాలువాతో సన్మానించి శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ ఫోటోను బహూ కరించారు. యోగా గురువులు ధ్యా న పద్ధతులను వివరించడమే కా కుండా హాజరైన వారితో సాధన చేయించారు.
ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ మనసును తన ఆధీనంలోకి తీసుకురావడమే సుదర్శన క్రియ అని, వర్తమానంలో పొందే ఆనందం కూడా ఈక్రియలో భాగమన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ ఒత్తిడిని పారద్రోలి ఆచారణా త్మక చర్యలకు వీలు కల్పిస్తూ మన ఆరోగ్యాన్ని జీవశక్తిని పెంపోంది స్తుందని తెలిపారు. సుదర్శన క్రియ ను 180 దేశాలలో నిత్యం సాధన చేస్తున్నారని దీంతో మానసిక, శారీ రక ఒత్తిడిని జయించి ఉల్లాసవంత మైన జీవితాన్ని పొందుతున్నారని చెప్పారు.
సుదర్శన క్రియ సర్వరోగ నివారిణి అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం సుదర్శన క్రియ చేయా లని ఎవరికి వారుగా వారి యొక్క ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాలని శ్వాస ప్రక్రియలో ప్రశాంతత దొరు కుతుందని తెలియజేశారు. ప్రతి రోజు ఒక గంట సమయం కేటా యించి ఈ యొక్క సుదర్శన క్రియ చేయడం వలన మనలో శక్తి పెరు గుతుందని తెలియజేశారు.
సుదర్శన క్రియ, యోగ మెడిటేషన్(Yoga meditation) ముగింపు కార్య క్రమంలో ప్రతి నిత్యం సుదర్శన క్రియ చేయడం వలన శక్తి పెరుగుతుంది ప్రకృతి సహకరిస్తుందని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పాకాల దినేష్, జనపాల శ్రీను, కోనేటి యాదగిరి, మాజీ ఎంపిటిసి పోలగోని స్వామి, ఏరుకొండ నరసింహ, బొడ్డు శీను, పాకాల సత్యనారాయణ, చెరుకు సైదులు, పట్ల జనార్ధన్, మర్రి రమేష్, బోయ స్వామి, గంగాపురం వెంకన్న, మేడబోయిన శ్రీను, చెరుకు వెంకన్న, కురుపాటి లింగయ్య, బెలిజ దిలీప్, పల్లపు రాకేష్, పల్లపు సాయి, వెంకన్న నరేష్ శంకరయ్య గోపాల్ నరసింహ మల్లేష్ గోపాల్, యాదయ్య, రాము, జానయ్యతదితరులు పాల్గొన్నారు.
Concluded Art of Living Happiness program