Retired Police Officers:రిటైర్డ్ పోలీసు అధికారులకు సత్కారం
పోలీస్ శాఖలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన హలో పోలీస్ అధికారులను జిల్లా పోలీస్ అధికారి చందనా దీప్తి ఘనంగా సన్మానించారు.
ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పీ చందనా దీప్తి
ప్రజా దీవెన నల్లగొండ క్రైమ్: పోలీస్(Police) శాఖలో పని చేస్తూ పదవీ విరమణ పొందిన హలో పోలీస్ అధికారులను జిల్లా పోలీస్ అధికారి చందనా దీప్తి(Chandana Deepti) ఘనంగా సన్మానించారు. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఎస్ఐ(SI) లు గౌసుద్దీన్,ప్రేమ్ కుమార్, ఏ.యస్.ఐ లు మారయ్య,అమీద్ మోయినోద్దీన్,హెడ్ కానిస్టేబుల్ పెద్ద సైదులు లను మంగళవారం జిల్లా ఎస్పీ జిల్లా పోలీసు కార్యాల యంలో ఘనంగా సత్కరించి వారి చేసిన సేవలను కొనియాడారు.
ఈ సందర్బంగా ఎస్పి(SP) మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించి పూర్తి ఆరోగ్యంతో నేడు పదవి విరమణ(Retirement)పొందడం అభినందనీయం అన్నారు. తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు. భవిష్యత్తులో ఏ విధమైన సమస్యలు తలెత్తినా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల బేనిపిట్స్ త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్బి రాములు నాయక్, ఎస్బి డిఎస్పీ రమేష్,ఏ.ఓ శ్రీనివాస్,సూపర్డెంట్ లు సబిత,షబిర్, ఎస్బి సీఐ రాఘవరావు,ఆర్ఐ సురప్పా నాయుడు,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జయరాజు,సోమయ్యతదితరులు పాల్గొన్నారు.
Tribute to Retired Police Officers