Poll Training:రేపటి నుండి 4 వరకు పిఓ, ఏపీఓ లకు శిక్షణ తరగతులు
నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం లో ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుంచి 4 తేదీ వరకు శిక్షణ
శిక్షణకు గైర్హాజరైతే కఠిన చర్యలు
కలెక్టర్ హరిచందన దాసరి
ప్రజా దీవెన నల్లగొండ: నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం(Parliamentary Constituency) లో ఎన్నికల విధులకు నియమించబడిన పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందికి మే 2 నుంచి 4 తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన(Dasari Harichandana) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకుగాను పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేయడంతో పాటు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని, ఈ ఉత్తర్వులను మే(May) ఒకటి నాటికి సంబంధిత అధికారులు పంపిణీ చేయాలని ఆదేశించారు.రెండో విడత శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మధ్యాహ్నం రెండు గంటలకు రెండు విడతల శిక్షణ కార్యక్రమాలు వారికి విధులు కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.
ఎన్నికల విధులకు నియమించబడిన పివో ,ఏపీవో, ఇతర పోలింగ్(Polling)సిబ్బంది తప్పనిసరిగా శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలని, లేనట్లయితే ఎన్నికల నిబంధనల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.మండల స్థాయిలో ఎంపీడీవో, ఎంఈఓ లు ఎన్నికల విధులకు(Election duties)నియమించబడిన సిబ్బందికి ఉత్తర్వులను అందజేసే ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకించి విద్యాశాఖకు సంబంధించిన ఉద్యోగులకు ఎంఈఓ ద్వారా, ఇతర ఉద్యోగులకు ఎంపీడీవో ద్వారా అందజేయాలని ఆదేశించారు.
జిల్లా స్థాయి అధికారులు వారి పరిధిలో పనిచేసే మండల, డివిజన్ స్థాయి అధికారులకు ఎన్నికల విధులకు నియమించబడిన ఉద్యోగులకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 2 ,3 తేదీలలో పి ఓ, ఏపీఓ లకు ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం రెండు గంటలకు శిక్షణ తరగతులు ఉంటాయని ,4 వ తేదీ ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు ఉంటాయని, ఆమె తెలిపారు.ట్రైనింగ్ కు(Training) సంబంధించిన పూర్తి వివరాలు, శిక్షణ ఇచ్చే స్థలం, తేదీ, ఇతర వివరాలు ఉత్తర్వుల కాపీలో సంబంధిత ఉద్యోగులకు వ్యక్తిగతంగా పంపించినట్లు కలెక్టర్ తెలిపారు.
Polling training classes for PO,APO