CM RevanthReddy rss reservations : రిజర్వేషన్లు సమాప్తం ఆరెస్సెస్ మూల సిద్ధాంతం
--ఆరెస్సెస్ రాజకీయ కార్యాచరణ నామకరణం బీజేపీ --రిజర్వేషన్లు కాపాడడం ముఖ్య మంత్రిగా నా బాధ్యత -- మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
రిజర్వేషన్ల సమాప్తం
ఆరెస్సెస్ మూల సిద్ధాంతం
–ఆరెస్సెస్ రాజకీయ కార్యాచరణ నామకరణం బీజేపీ
–రిజర్వేషన్లు కాపాడడం ముఖ్య మంత్రిగా నా బాధ్యత
— మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో రిజర్వేషన్లను సమాప్తం చేయ డం రాష్ట్రీయ స్వయంసేవక్ ఆరెస్సెస్ మూల సిద్ధాంతమని తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( CM RevanthRe ddy)ఆరోపించారు. ఆరెస్సెస్ రాజకీయ కార్యాచరణ నామకరణమే బీజేపీ అని వ్యాఖ్యానించారు. దేశంలో సమూలంగా రిజర్వేషన్లు తీ సేయడం ఆరెస్సెస్ లక్ష్యమని, రిజర్వేషన్లు కాపాడడం ముఖ్య మం త్రిగా నా బాధ్యత అని ఉద్ఘా టించారు.
బుధవారం సాయంత్రం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో మాట్లాడారు. ఆరెస్సెస్ (rss) విధానాలపై నేను స్ప ష్టంగా మాట్లాడుతున్నానని, బీజేపీ అబద్దాల యునివర్సిటీ కాగా దానికి వీసీ మోదీ, రిజిస్ట్రార్ అమిత్ షాలపై వ్యంగ్యాస్త్రాలు సం ధించారు. నరేంద్రమోదీ కన్వర్టెడ్ బీసీ ఆని అందుకే ఆయనకి బీసీల పై ప్రేమ లేదని, రిజర్వేషన్లు తొలగించాలని ఆరెస్సెస్ వందేళ్ల క్రితమే టార్గెట్ పెట్టుకుందని గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని సవరించాలి రిజర్వేషన్లు ( reservations) రద్దు చేయాలనేదే బీజేపీ లక్ష్యమని, ఎవరో సోషల్ మీడి యాలో పోస్ట్ పెడితే ముఖ్య మంత్రి పై కేసులు పెడుతారా అని ప్రశ్నించారు. నన్ను ఎన్నికల ప్రచారం చేయ కుండా బీజేపీ ప్రయత్ని స్తోందని, అమిత్ షా, మోదీ (modi ) పోలీసులతో నన్ను బెదిరించడం సాధ్యపడని విషయమని హెచ్చ రించారు.
రాజ్యాంగం మార్చడానికే వచ్చామని కేంద్రమంత్రి అనంత కుమార్ హెగ్డే ప్రకటించారని, లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ రిజ ర్వేషన్లు అభివృద్ధికి ఉపయోగపడుతాయా అని మాట్లాడారని గుర్తు చేశారు.మా తరపున మహిళ అడ్వకేట్ వెళ్తే ఆమెతో డిల్లీ పోలీ సు లు ర్యూడ్ గా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.
ఎన్నికలకు ఇబ్బంది అవుతుందనే నేను మాట్లాడే విషయాలను ప క్కదోవపట్టిస్తున్నారని, నిజాలు మాట్లాడుతున్నం దుకే నాపై డిల్లీలో అక్రమ కేసులు పెట్టారని, నేను మాట్లాడేది నాకోసమో, నా పార్టీ కోసమో కాదని స్పష్టం చేశారు. నేను మాట్లాడే విషయాలపై మోదీ, అమిత్ షా వాళ్ళ పార్టీ విధానాన్ని తెలిపదానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.
ఢిల్లీ పోలీసులు వస్తే మాట్లాడడం మానేస్తానని అనుకుంటున్నారే మో అని వ్యాఖ్యానించారు.రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియలలో భాగం గా వాజపేయి హాయాంలో కమిషన్ ఏర్పాటు చేస్తూ మొదటి సారి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారని వివరించారు. 2002లో కమి షన్ రిపోర్ట్ ఇచ్చిందని, దళితు లకు హక్కులు లేని హిందూ సమా జం మేలు అని గోల్వాల్కర్ నివేది కలో పేర్కొన్నారని తెలిపారు.
ఎన్జీ బైద్య అనే ఆరెస్సెస్ ఫిలాసఫర్ 2015లో కులపరమైన రిజర్వే షన్లు రద్దు చేయాలని రాశాడని,1978లో మండల్ కమిషన్ ఏర్పా టు చేస్తే దానికి వ్యతిరేకంగా కమాండల యాత్ర నిర్వహించారని చె ప్పారు. రాహుల్ పాదయాత్ర సమయంలో చాలామంది కలిసి రిజ ర్వేషన్లను పెంచాలని వినతి పత్రాలు ఇచ్చారని చెప్పారు.
రిజర్వేషన్లు తొల గించాలని బీజేపీ అనుకుంటున్న సమయంలో ఆ కుట్రలు బద్దలు కొట్టడంతో బీజేపీ అప్రమత్తమైందని అన్నారు.400 సీట్లు వస్తే తాము అనుకున్నది సాధ్యమని బీజేపీ ( bjp ) భావిస్తోం దని, వాజపేయి హాయాంలో ఇచ్చినజస్టిస్ వెంకటాచలం రిపోర్ట్ పై అమిత్ షా, మోదీ వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజే పీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు కు మద్దతు ఇచ్చినట్టేనని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో సంక్షేమం, అభి వృద్ధి అనే చర్చ పక్కన పోయిం దని, ఈ దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవని, ముస్లిం లకు ఉన్న రిజర్వేషన్లు బీసీ ఈ కింద ఇస్తున్నారని వివరించారు.