Komati Reddy Venkat Reddy:అన్నట్లుగానే ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ
ప్రభుత్వం అన్నట్లుగానే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
మూడేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగా న్ని పూర్తి చేయిస్తాo
బీఆర్ఎస్, బిజెపి లకు ఓటు వేస్తే మూసిలో వేసినట్లే
జూన్ లో నియోజకవర్గంలో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు
రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినీమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: ప్రభుత్వం అన్నట్లుగానే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) స్పష్టం చేశారు. నల్లగొండ పార్ల మెంట్ ఎన్నికల సందర్భంగా బుధ వారం నల్లగొండ పట్టణంలోని ఓ ప్రై వేట్ ఫంక్షన్ హాల్ లో పట్టణ కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నల్గొండ నియోజకవర్గ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావే శంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. తూ రుణమాఫీ చేయకపోతే దేనికై నా రెడీ అని, ప్రజలకు ముందుకు వెళ్ళమని మంత్రి పేర్కొన్నారు.
గత పది సంవత్సరాలుగా అధి కారంలో ఉన్న బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని విమ ర్శించారు. అధికారం కోల్పోవడం తో పాటు కవిత జైలుకు వెళ్లడంతో కెసిఆర్ ,కేటీఆర్, హరీష్ రావులు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడు తున్నారని విమర్శించారు. లక్షల కోట్లు సంపాదించుకున్న కుటుంబం పరిస్థితి ఏమైందో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. హరీష్ రావు రెండు పేజీల దొంగ రాజీనామా లెటర్ రాసుకు వచ్చిం దని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections)బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూసిలో వేసినట్లేనని అన్నారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.మతసామరస్యానికి ప్రతీక కాంగ్రెస్(Congress) పార్టీ అని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర ద్వారా నిరూపించా డని పేర్కొన్నారు. మత విద్వేషా లతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజకీయం చేస్తుందని విమర్శిం చారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అధికా రంలో ఉన్నప్పుడు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు.
వచ్చే మూడేళ్లలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేయిస్తానని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్ని కలు పూర్తయిన వెంటనే రూ.700 కోట్లతో నల్గొండ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) కలిసి అందరం టీం వర్క్ గా పని చేస్తున్నామని అన్నారు. నల్లగొండ నియోజకవర్గం తో పాటు జిల్లా అభివృద్ధి కోసం ఎన్ని నిధులైన తీసుకువస్తానని తెలిపారు.నాకు పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తా నని స్పష్టం చేశారు.
జూన్ 2 నుంచి నల్గొండ(Nalgonda) నియోజకవర్గంలో ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా వాలంటరీ వ్యవస్థ తీసుకువచ్చి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి నా గౌరవాన్ని కాపాడాలని కోరారు. 75 వేల నుంచి నుంచి లక్ష మెజార్టీ తీసుకురావాలని అన్నారు.
ఈ ఎన్నికల తర్వాత సర్పంచ్, స్థానిక సంస్థల ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించే బాధ్యత తాను, రఘువీర్ రెడ్డి తీసుకుంటామని పేర్కొన్నారు.పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు.రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డికి స్వాగతం పలికి, ఆయనకు మంచి భవిష్యత్తు ఉందని వ్యాఖ్యానించారు.పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు.
మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదని విమర్శించారు. ప్రాజెక్టులు కట్టింది, గ్రామాలకు విద్యుత్ తీసుకువచ్చింది, ఇందిరమ్మ ఇల్లు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చింది..తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని బీఆర్ఎస్, బిజెపి నాయకులు పేర్కొనపట్ల ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైల సొరంగం మార్గాన్ని 30 కిలోమీటర్లు పూర్తిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు మీ అందరి గెలుపు అని వ్యాఖ్యానించారు. ఎంపీగా తన గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకు మార్ రెడ్డిల అడుగుజాడలో నడు స్తూ నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని అన్నారు. ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పని చేయాలని కోరారు.
ఈ కార్య క్రమంలో డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఇన్చార్జి నిరంజన్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్ది సుమన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొండేటి మల్లయ్య, తిప్పర్తి జడ్పిటిసి పాశం రాం రెడ్డి, మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, మహమ్మద్ బషీర్, ఇంతియాజ్ హుస్సేన్, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు.
SLBC tunnels completed in three years