Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komatireddy venkat reddy: నల్గొండలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్

కాంగ్రెస్ యువ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ లోకి భారీగా వలసలు

ప్రజా దీవెన నల్లగొండ:  కాంగ్రెస్ యువ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా వలసలు మొదలయ్యాయి. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్గొండ, కనగల్ మండలాలకు చెందిన దాదాపు వందమంది ముఖ్య కార్యకర్తలు హైదరాబాద్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్పీటీసీలు, సర్పంచులు, సీనియర్ నాయకులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్‌లో చేరిన వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు శుభ పరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పాత, కొత్త నేతల సమన్వయంతో పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీ దిశగా పని చేయాలని సూచించారు.

అడగ్గానే అపాయింట్మెంట్ ఇచ్చి తమ వర్గీయులను పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గుత్తా అమిత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మార్గదర్శకత్వంలో తామంతా పని చేస్తామని గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, యువ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి తోపాటు మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

BRS workers joined congress