Uttam kumar reddy:కెసిఆర్, మోదీని ప్రజలు తిరస్కరిం చారు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మోడీని తిరస్కరిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.
దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని ప్రజలు కోరుకుంటున్నారు
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుంది
రాష్ట్ర నీటిపారుదల, పౌరసర ఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి
ప్రజా దీవెన, కోదాడ: తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మోడీని తిరస్కరిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Uttam kumar Reddy) అన్నారు. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరి రఘువీరారెడ్డి విజయా న్ని కోరుకుంటూ గురువారం పట్టణములు పాదయాత్ర నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం మంత్రి మాట్లా డుతూ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధిస్తుందని దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపడతారని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్(TRS) పార్టీ పని అయిపోయిందని ఆయన చూసింది నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డిని(Raghuveera Reddy) కనివిని ఎరుగని భారీ మెజార్టీతో గెలిపించాలని దేశంలోనే నల్లగొండ పార్లమెంటు భారీ మెజార్టీతో గుర్తింపు వస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో హుజూర్నగర్ కోదాడ(Kodada) అభివృద్ధిలో రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు కోదాడ నియోజకవర్గం శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులు కుందూరి జానారెడ్డి మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెర్నేని వెంకటరత్నం సాముల శివారెడ్డి చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి వంగవీటి రామారావు ముత్తారపు పాండు రంగారావు పారసీతయ్య తదితరులు పాల్గొన్నారు.
People rejected KCR and Modi rule