Tinmar Mallanna :సంచలన నిర్ణయం తీసుకున్న తీన్మార్ మల్లన్న
ఇప్పటి వరకు రాష్ట్ర,దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు తీసుకోని సంచలన నిర్ణయం నల్లగొండ నడి బొడ్డున నవ నాయకుడు ప్రజా గొంతుక,తీన్మార్ మల్లన్న తీసుకున్నాడు.
రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన్న ఓ సంచలనం
నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్…
గతంలో చెప్పిన విధంగా మాటకు కట్టుబడిన మల్లన్న…
తన,తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చిన మల్లన్న…
ఆస్తుల బాండ్ ను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అందజేసిన మల్లన్న…
ఇది దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం…
నేటి రాజకీయ తరానికి ఓ మార్గనిర్దేశం…
నాయకుడంటే ప్రజల కోసం బ్రతికేవాడు, ప్రజల మీద బ్రతికే వాడు కాదని నిరూపించిన మల్లన్న…
ప్రజా దీవెన నల్లగొండ: దేశంలో నల్లగొండ జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మరో సంచలన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకు రాష్ట్ర,దేశ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు తీసుకోని సంచలన నిర్ణయం నల్లగొండ నడి బొడ్డున నవ నాయకుడు ప్రజా గొంతుక,తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna) తీసుకున్నాడు. గతంలో చెప్పినట్టే తాను రాజకీయాల్లో అడుగు పెట్టేనాడు తన పేరు మీద,తన కుటుంబ పేరుతో ఉన్న అస్తి మొత్తం ప్రభుత్వానికి రాసి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించాడు.
ఆ మాట నిలబెట్టుకుంటూ నేడు ఎమ్మెల్సీగా నామినేషన్(nomination) వేసే సందర్భంలో తన కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి బాండ్ రూపంలో రాసిచ్చిన తీన్మార్ మల్లన్న నిజమైన ప్రజా నాయకుడుగా చరిత్రలో తనకంటూ ఓ పేజీని రాసుకున్నాడు. ఇంత కాలం అనేక విమర్శలు వచ్చినా భరిస్తూ వచ్చిన మల్లన్న తాను మాటల నాయకుడిని కాదని చేతల నాయకుడిని అని చాటి చెప్పారు. దీనితో వేదిక మీదున్న పెద్దలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,మల్లన్న అభిమానులు మల్లన్న నిర్ణయంతో హర్షధ్వానాలు చేశారు.
Tinmar Mallanna take sensational decision