welfare of farmers: రైతుల సంక్షేమానికి సహకార సంఘాలు కృషి: శ్రీనివాస్ రెడ్డి
రైతుల సంక్షేమానికి సహకార సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు
ప్రజా దీవెన కోదాడ: రైతుల సంక్షేమానికి సహకార సంఘాలు నిరంతరం కృషి చేస్తున్నాయని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కోదాడ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం బ్యాంకులో సభ్యత్వం పొందిన కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామానికి చెందిన వట్టికూటి.
శ్రీను ఇటీవల ప్రమాదవశాత్తు మరణించాడు. కాగా అతను సంఘంలో రుణం తీసుకున్న సమయంలో జనతా ఇన్సూరెన్స్ కల్పించడంతో ఇన్సూరెన్స్ సంస్థ నుండి మంజూరైన లక్ష రూపాయల చెక్కును అతని భార్య ఉపేంద్ర కు అందజేసినట్ల తెలిపారు రైతులు సహకార సంఘాలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుడిగం. నరేష్,డైరెక్టర్ ప్రభాకర్ రావు,జాబిశెట్టి. చంద్రమౌళి, సీఈఓ మంద వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.
Cooperative societies work for welfare of farmers