Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Techno fest: టెక్నో ఫెస్టులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

టెక్నో ఫెస్టులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని జేఎన్టీయూ జగిత్యాల ప్రొఫెసర్ సురేష్ కుమార్ అన్నారు. కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో శుక్రవారం నిర్వహించిన టెక్నో ఫెస్ట్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజలన చేసి టెక్నో ఫెస్ట్ ప్రారంభించి మాట్లాడారు.

టెక్నో ఫెస్టులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి.. ప్రొఫెసర్ సురేష్ కుమార్

సాంకేతిక నైపుణ్యాల పెంపు కు టెక్నో ఫెస్టులు…ప్రిన్సిపల్ గాంధీ

కోదాడ కిట్స్ 2కె24 కు భారీ స్పందన

కిట్స్ టెక్నో ఫెస్టివల్ లో అలరించిన సంస్కృతి కార్యక్రమాలు

ప్రజా దీవెన కోదాడ: టెక్నో ఫెస్టులు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని జేఎన్టీయూ జగిత్యాల ప్రొఫెసర్ సురేష్ కుమార్ అన్నారు. కోదాడ కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో శుక్రవారం నిర్వహించిన టెక్నో ఫెస్ట్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజలన చేసి టెక్నో ఫెస్ట్ ప్రారంభించి మాట్లాడారు. ఫెస్ట్ లో భాగస్వాములైన విద్యార్థుల ప్రతిభాపాఠవాలు పెంపొందించుకోవచ్చని. విద్యార్థుల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని తెలిపారు విద్యార్థులు పరిశోధనాత్మక రంగాల వైపు దృష్టి సారించాలన్నారు.

Techno fests encourage innovation

కళాశాల ప్రిన్సిపల్ గాంధీ మాట్లాడుతూ నేడు కృత్రిమ మేధ(Artificial Intelligence) , బిగ్ డేటా ఆటోమేషన్(Big Data Automation) వంటి అంశాలు నేటి సాంకేతి కత ను ప్రభావితం చేస్తున్నాయని విద్యార్థులు వీటిపై నైపుణ్యతను పెంచుకోవాలన్నారు. కళాశాల అకాడమిక్ అడ్వాయిజర్ పోతూగంటి నాగేశ్వరరావు, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ సిహెచ్ నాగార్జున్ రావు లు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని అన్నారు ఉభయ రాష్ట్రాల పరిధిలో టెక్నో ఫస్టు కోదాడలో నిర్వహించడం కిట్స్ కళాకారులకు గర్వకారణం అన్నారు.

కాగా కళాశాలలో నిర్వహించిన ఫెస్ట్ కు (Techno fests)ఉభయ రాష్ట్రాల నుండి వివిధ కళాశాలకు చెందిన విద్యార్థినిలు భారీగా హాజరయ్యారు వెస్ట్ లో పేపర్ పోస్టర్ ప్రజెంటేషన్ ప్రాజెక్టు ఎక్స్ పో టెక్నికల్ క్విజ్ పోటీల్లో విద్యార్థినులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థినుల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో ఏవో కృష్ణారావు టెక్నికల్ ఫెస్ట్ కన్వీనర్లు డాక్టర్ ఎండి ఎజాజ్, నరేష్ రెడ్డి కళాశాల హెచ్వోడీలు రమేష్ స్రవంతి జనార్ధన్ అధ్యాపకులు విద్యార్థినిలు పాల్గొన్నారు.

Techno fests encourage innovation