హిందువులు సురక్షితంగా లేరు
బెంగాల్ రాష్ట్రంలో హిందువులు సురక్షి తంగా లేరని, హిందువులను బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ హిందువులను రెండవ తరగతిగా పరిగణిస్తున్నారన్నారని విచారం వ్యక్తం చేశారు.
బెంగాల్ లో రెండో తరగతి ప్రజలుగా చూస్తున్నారు
రాహుల్ గాంధీ వయనాడ్ లో ఓటమి భయంతోనే రాయబరేలికి పారిపోయారు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ర్యాలీ లో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రజా దీవెన, కోల్ కత్తా: బెంగాల్(west bengal) రాష్ట్రంలో హిందువులు సురక్షి తంగా లేరని, హిందువులను(hindus) బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ హిందువులను రెండవ తరగతిగా పరిగణిస్తున్నారన్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటీవలి ఘటనలు కొన్ని ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. టీఎంసీ వామప క్షాలు, కాంగ్రెస్ కు అభివృద్ధి దృక్ప థం లేదని ప్రధాని మోదీ ఆరోపిం చారు. ఈ మూడు పార్టీలు ఒక రాష్ట్రానికి ఏం చేయగలవో అలో చించాలంటూ విజ్ఞప్తి చేశారు.
పశ్చిమ బెంగాల్ లోని బర్ధమాన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీ లో ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) ప్రసంగిం చారు. టీఎంసీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ ను టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లా డుతూసరదాగా గడపడానికి పుట్ట లేదని, నా కోసం జీవించాలని కోరు కోవడం లేదని అన్నారు. సేవ చేయాలనే సంకల్పంతో, 140 కోట్ల మంది గొప్ప భారత మాత దేశ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా నన్నారు. దేశ ప్రజలందరూ ఎంత గానో ఆశీర్వదించారు.
భగవంతుని రూపంలో ఉన్న వ్యక్తులు ఇన్ని వరాలను కురిపిస్తారని, ఈ ఆశీర్వా దాలు మరింతగా పెరగాలని మోదీ ఆకాంక్షించారు. మీ కలలను నెరవేర్చు కోవడానికి జీవితంలో ఒకే ఒక కల ఉందన్న ప్రధాని మోదీ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని తయారు చేసేందుకు, స్వావలం బన భారత్ గా మార్చేందుకు రాత్రింబవళ్ళు శ్రమిస్తున్నానన్నారు. నా భారతదేశం, నా కుటుంబం. నీ కలల కోసం దృఢ సంకల్పంతో జీవిస్తున్నానని తెలిపారు. ఇన్నే ళ్లుగా మీరు నాకు అందించిన మద్దతు నన్ను నిరాడంబరప రిచింది. ఎవరైనా ప్రధానమంత్రి అయిన తర్వాత సులభంగా విశ్రాంతి తీసుకోవచ్చు.
చరిత్రలో తన పేరును ఇప్పటికే నమోదు చేసుకు న్నాడు. కానీ, నేను ఆనందించడానికి ఇక్కడ లేనని, జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేయాలనుకుం టున్నాని ఉద్వేగభరితంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడంపై ప్రధాని మోదీ తనదైన శైలి స్పందించారు. అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే భయపడుతోం దని ప్రధాని అన్నారు. భయపడ వద్దు అంటూ రాహుల్ గాంధీకి(Rahul gandhi) సూచించారు. అమేథీని వదిలి రాయ్‌బరేలీకి రాహుల్ గాంధీ పారిపోయారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, రాహుల్ వాయనాడ్ లో ఓడిపో తారని ప్రధాని జోస్యం చెప్పారు.
అందుకే వాయనాడ్ నుండి పారిపోయి రాయ్ బరేలీకి వచ్చాడ న్నారు. కాంగ్రెస్ 2019 కంటే తక్కువ సీట్లు గెలుస్తుందన్న మోదీ, వీళ్లు ఊరూరా తిరుగుతూ భయప డకండి అని చెబుతుంటారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో అతిపె ద్ద నేతకు ఎన్నికల్లో పోటీ చేసే ధై ర్యం లేదన్నారు. రాజస్థాన్ కు పారి పోయిన ఆమె రాజ్యసభకు వచ్చా రన్నారు. ఉత్తర్ ప్రదేశ్(Uttar pradesh) లోని రాయ్బ రేలీ నియోజకవర్గం నుంచి తమ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేయ నున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాహుల్ కొత్త సీటు వెతుక్కుం టారని తాను ముందే చెప్పానని గుర్తుచేశారు. ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. యువరాజు వయనాడ్ లో ఓడిపోనున్నారని, అక్కడ పోలింగ్ పూర్తయిన వెంటనే ఆయన మరో సీటు కోసం అన్వేషణ ప్రారంభిస్తా రని చెప్పాను.
అమేఠీ అంటే భయంవేసి రాయ్‌బరేలీ వైపు పరుగులు తీస్తున్నారు. భయప డకండి అని వారు అందరితో అంటారు. ఈ రోజు అదే నేను వారికి చెప్తున్నాను. భయపడకండి, పారిపోకండి. ఈ ఎన్నికల ఫలితా లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలాం టి ఒపీనియన్ పోల్స్ అవస రం లేదు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని తీసుకురాలేదని, కానీ ఓట్ల కోసం సమాజాన్ని ఎలా విభజించాలో మాత్రం తెలుసని విమర్శించారు. రాహుల్ పోటీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ(Union Minister Smriti Irani)కూడా స్పందించారు. గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ కూడా అమేరీలో పోటీ చేయడం లేదంటే ఎన్నికలకు ముందే వారు అక్కడ ఓటమిని అంగీకరించారనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేరీకి 2004 నుంచి 2019 వరకు రాహుల్ ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం వయనాడ్ సిట్టింగ్ ఎంపీ అయిన ఆయన అక్కడి నుంచి మరోసారి పోటీ చేశారు. ఈ క్రమంలోనే రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తారని ప్రకటన వచ్చింది.
Hindus are not safe in west bengal